సీఎం కుర్చీపై కాంగ్రెస్ సీనియర్ల సైలెన్స్... ఇదా సంగతి !

తెలంగాణ కాంగ్రెస్ పేరు చెప్తే చాలు ముందుగా కనిపించేది ఆధిపత్య పోరు.ఎవరికి వారే పార్టీలో తామే సీనియర్లు అని చెప్పుకుంటూ… హడావుడి చేసేస్తుంటారు.

 Who Is Telangana Prajakutami Cm Candidate-TeluguStop.com

అంతే కాదు గ్రూపు తగాదాలతో ఎప్పుడూ అధిష్టానానికి పెద్ద తలనొప్పి సృష్టిస్తూ ఉంటారు.ఇక వీరి విషయంలో ఢిల్లీ పెద్దలు కూడా గట్టిగా మందలించలేక … చూస్తూ ఊరుకోలేక సతమతం అవుతూ ఉంటారు.

అయితే కొద్ది రోజులుగా వీరి హడావుడి బాగా తగ్గిపోయింది.తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు సీఎం అయ్యే అర్హత తమకే ఉంది అంటూ… అంటూ ఎవరికి వారు ప్రకటనలు చేస్తూ అహడావుడి సృష్టించారు.

కానీ ఒక్కసారిగా ఇప్పుడు అంతా సైలెన్స్ అయిపోయి ఎవరి నియోజకవర్గాల్లో వారు సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతున్నారు.వీరి హడావుడి మాయం అవ్వడం వెనుక పెద్ద కారణమే ఉన్నట్టు కనిపిస్తోంది.

కాంగ్రెస్ సీనియర్ నాయకుల హోదాలో … రాష్ట్రమంతటా ప్రచారం నిర్వహించాల్సిన వీరంతా … గడప దాటకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఒకరిద్దరు అప్పుడప్పుడూ… పక్క జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ప్రచారం చేస్తూ.ఆ తరువాత నియోజకవర్గానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.అయితే వీరు నియోజకవర్గానికే పరిమితం కావడానికి కారణాలున్నాయి.జానారెడ్డి గెలుపు ఈసారి అనుకున్నంత సులువు కాదని వార్తలొస్తున్నాయి.అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నర్సింహాయ్య బలంగా ప్రచారం చేస్తుండడంతో జానారెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు.

ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బలమైన టీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి హోరా హోరీ ఫైట్ ఇస్తున్నారు.ఇక డీకే అరుణ కూడా ఈసారి బలమైన పోటీని ఎదుర్కొంటోంది.

గెలిస్తే మంత్రి, వీలుంటే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తుండడంతో వీరంతా ప్రస్తుతం నియోజకవర్గంలో గెలవడంపైనే దృష్టిపెట్టారు.

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే పార్టీలన్నిటిని ఒక చోట చేర్చి మహాకూటమి పేరుతో కాంగ్రెస్ ఒక్కటి చేసింది.ఆ తరువాత… ఎన్నో తర్జన భర్జనల అనంతరం మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి తీసుకురాగలిగింది.ఈ సమయంలో కొన్ని సీట్లు కూటమిలోని పార్టీలకు త్యాగం చేసింది.

అసలు కూటమి అధికారంలోకి వస్తే.సీఎం అభ్యర్థి ఎవరు అన్న అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది.

ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ వంటి సీనియర్ నేతల పేర్లు వినిపించాయి.వీరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా ఏ ఒక్కరు రాష్ట్ర మంతటా తిరిగి ప్రచారం చేయడం లేదట.

దీనికి కారణం మాత్రం ఒక్కటే అని తెలుస్తోంది.అదేంటి అంటే … ఈ సీనియరులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పోరు హోరాహోరీగా ఉండేలా ఉందట.అందుకే… ముందు నియోజకవర్గంలో గెలిస్తే చాలు … ఆ తరువాత సీఎం కుర్చీ గురించి ఆలోచిద్దాం అనే అభిప్రాయంలో వారు ఉండిపోయారట.ఇదండీ సంగతి !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube