సీబీఐ చేతికి అయేషా మీరా హత్య కేసు ! హైకోర్ట్ కీలక ఆదేశాలు

అప్పట్లో విజయవాడలో జరిగిన బీ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.ఈ ఘటన జరిగి దాదాపు 11 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అతీగతీ లేదు.

 Aisha Murder Case On Cbi Custody High Court Directions-TeluguStop.com

అయితే తాజాగా… ఈ హత్య కేసును ఈరోజు ( గురువారం) హైకోర్టు సిబిఐకి అప్పగించింది.ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

కేసు తారుమారు కావటంలో పాత్ర ఉన్నదన్న ఆరోపణలపై విజయవాడ న్యాయస్థానం సిబ్బందిపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఆయేషా మీరా కేసులో కీలక మలుపు తిరిగింది.సిట్‌ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఇవాళ ఈ కేసును సీబీఐకి అప్పగించింది.కేసును మొదటి నుండి విచారణ చేయాలని సీబీఐని ఆదేశించింది.

ఇప్పటికే హైకోర్టులో ఆయోషా మీరా తల్లి, ప్రజా సంఘాలు, మహిళ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి.ఈ కేసులో శిక్ష అనుభవించిన సత్యం బాబును 2016లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube