భారతీయులకి గుడ్ న్యూస్...ఈబీ- 5 వీసా గడువు పెంపు

ఈబీ-5 వీసా కి దరఖాస్తు చేసుకోవాలని అనుకున్న భారతీయలకి గుడ్ న్యూస్ గతంలో మాదిరిగానే అమెరికా ప్రభుత్వం ఈబీ-5 వీసా విషయంలో పెట్టవలసిన పెట్టుబడులని యాదాతధంగా కొనసాగిస్తూ డిసెంబర్ 7 వరకూ నిర్ణయం తీసుకుంది అమెరికా దాంతో ఎంతోమంది భారతీయ పెట్టుబడి దారులు లాభపడనున్నారు.

 The New Visa Rules On Eb 5 Visa-TeluguStop.com

ఈబీ-5 ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 లక్షల డాలర్లు (రూ.7.2 కోట్లు).అయితే కొన్ని కొన్ని ప్రత్యేక నిర్ణయించబడిన ప్రాంతాల్లో అయితే 5 లక్షల డాలర్లు (3.6 కోట్లు) పెట్టుబడి పెట్టాలి.ఏండ్ల తరబడి ఇదే మొత్తం పెట్టుబడి కొనసాగుతుండటంతో ఈ మొత్తాన్ని పెంచాలని ఒబామా హయాంలో ఓ బిల్లును తీసుకొచ్చారు.దాని ప్రకారం పెట్టుబడి మొత్తాన్ని 18 లక్షల డాలర్లు (రూ.12.96 కోట్లు) ప్రత్యేక ప్రాంతాల్లో 13.5 లక్షల డాలర్ల (రూ.9.72 కోట్లు)కు పెంచాలని ప్రతిపాదించారు.

అయితే ప్రస్తుతం ఈ పెంపు ప్రతిపాదనపై వెనకడుగు వేశారు డిసెంబర్ 7 వరకూ ఎలాంటి ప్రతిపాదన లేదని తేల్చి చెప్పారు దాంతో ఈబీ-5 పొందే అవకాశం భారతీయులకి లభిస్తోంది.దాంతో ఈ ఈబీ-5 వీసా కోసం అప్లై చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అంటున్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube