ఎన్టీఆర్‌ అంటే గౌరవం లేదా అంటూ బాలకృష్ణపై ఫ్యాన్స్‌ ఆగ్రహం

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.

 Ntr Fans Fire On Adarsh Balakrishna-TeluguStop.com

విదేశాల్లో ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణతో సినిమా పూర్తి అవ్వనుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.అక్టోబర్‌లో దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌తో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆదర్శ్‌ బాలకృష్ణ నటిస్తున్నాడు.తాజాగా ఆ విషయాన్ని ఆదర్శ్‌ బాలకృష్ణ తెలియజేస్తూ ఒక ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడం జరిగింది.

ఆదర్శ్‌ బాలకృష్ణ ట్విట్టర్‌లో ఈ విషయమై తెలియజేస్తూ.అరవింద సమేత చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఎప్పటినుండో అనుకుంటున్న కల సాకారం అయ్యింది.ఎన్టీఆర్‌ మరియు త్రివిక్రమ్‌ సర్‌కు కృతజ్ఞతలు అంటూ ఆదర్శ్‌ బాలకృష్ణ పోస్ట్‌ చేశాడు.దీంతో పాటు ఒక ఫొటోను కూడా పోస్ట్‌ చేశాడు.ఇప్పుడు అదే పోస్ట్‌ అతడిని వివాదంలోకి లాగింది.ఎన్టీఆర్‌ అంటే కనీస గౌరవం లేదా అంటూ ఫ్యాన్స్‌ ఆయనపై తీవ్ర స్థాయిలో మండి పడుతూ రీ ట్వీట్‌లు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ అంటే గౌరవం లేదు కనుక సర్‌ అంటూ సంబోధించలేదని, ఎన్టీఆర్‌ మాకు దేవుడు నీవు ఎన్టీఆర్‌ను సర్‌ అని లేదంటే గారు అని పిలవాల్సిందే.కాస్త ఫేం రాగానే నేను తోపును అనే భావన రానివ్వమాకు అంటూ కొందరు హెచ్చరించారు.ఇక ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ను కూడా ఆదర్శ్‌ బాలకృష్ణ సరిగా ట్యాగ్‌ చేయలేదు.ఎన్టీఆర్‌9999 అనే ట్విట్టర్‌ అకౌంట్‌ను ట్యాగ్‌ చేయకుండా ఎన్టీఆర్‌కు చెందిన ఫేక్‌ అకౌంట్‌ను ట్యాగ్‌ చేయడం జరిగింది.అది కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ ఉన్న పేజీని ట్యాగ్‌ చేశాడు.ఈ విషయంలో కూడా ఆదర్శ్‌పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నావు, ఎన్టీఆర్‌ అధికారిక ట్విట్టర్‌ పేజీ ఏదో నీకు తెలియడం లేదా అంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.మొత్తానికి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో సోషల్‌ మీడియాలో ఆదర్శ్‌ బాలకృష్ణను ఆడేసుకున్నారు.బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ తర్వాత ఆదర్శ్‌ చాలా బిజీ అవుతాడని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఆశించిన స్థాయిలో ఈయనకు అవకాశాలు రాలేదు.ఎట్టకేలకు ఎన్టీఆర్‌ మాట్లాడి మరీ అవకాశం ఇప్పించాడు.ఈ అవకాశంను సద్వినియోగం చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube