ఎన్నారై పెళ్ళిళ్ళు..48 గంటలే గడువు..లేకపోతే..

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి మేనకా గాంధీ సంచలన ఆదేశాలు జారీ చేశారు.ఎన్నారైల వివాహాలని 48 గంటలలోగా దేశంలో ఎక్కడ జరుగుతున్నా సరే రిజిష్టరు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

 ఎన్నారై పెళ్ళిళ్ళు..48 గంటలే గడ-TeluguStop.com

లా కమిషన్ నివేదికలో చేసిన సిఫార్సుల దృష్ట్యా ఎన్నారైలు పెళ్లి చేసుకున్న తరువాత 30 రోజుల్లోగా రిజిస్టరు చేసుకోవాలని తెలిపారు…అయితే ఒక వేళ ఎవరైనా రిజిష్టరు చేసుకోక పొతే.

ఆ రిజష్టరు గడువు 30 రోజులు గనుకా దాటితే రోజుకు ఐదు రూపాయల చొప్పున జరిమానాను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.ఎన్నారైలు చేసుకున్న వివాహాలను 48 గంటల్లోగా రిజిస్టరు చేయించుకోకుంటే వారి పాస్ పోర్టు, వీసాలను జారీ చేయమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు…ఇదిలాఉంటే ఎన్నారైల వివాహాలను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖకి సంభందించిన డాటాబేస్ లో పొందు పరుస్తామని మనేకాగాంధీ ప్రకటించారు.
అయితే ఈ విధమైన విధానాలని అమలు చేయడానికి ప్రత్యేకమైన కారణం లేకపోలేదు.

ఎన్నారైలతో ఏర్పడుతున్న వివాహ వివాదాలను పరిష్కరించేందుకు ఈ విధానపరమైన చర్యలు తీసుకున్నామని మంత్రి మీడియాకి తెలిపారు.ఎన్నారైల వివాహ వివాదాలపై తాము ఆరు లుక్ అవుట్ సర్కులర్లను జారీ చేశామని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వార మరో ఐదుగురు ఎన్నారైల పాస్ పోర్టులను రద్దు చేశామని మనేకాగాంధి వివరించారు.

ఎవరైనా సరే ఈ విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వీసాలని రద్దు చేస్తామని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube