ఎన్నారై పెళ్ళిళ్ళు..48 గంటలే గడువు..లేకపోతే..
TeluguStop.com
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి మేనకా గాంధీ సంచలన ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నారైల వివాహాలని 48 గంటలలోగా దేశంలో ఎక్కడ జరుగుతున్నా సరే రిజిష్టరు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
లా కమిషన్ నివేదికలో చేసిన సిఫార్సుల దృష్ట్యా ఎన్నారైలు పెళ్లి చేసుకున్న తరువాత 30 రోజుల్లోగా రిజిస్టరు చేసుకోవాలని తెలిపారు.
అయితే ఒక వేళ ఎవరైనా రిజిష్టరు చేసుకోక పొతే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఆ రిజష్టరు గడువు 30 రోజులు గనుకా దాటితే రోజుకు ఐదు రూపాయల చొప్పున జరిమానాను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఎన్నారైలు చేసుకున్న వివాహాలను 48 గంటల్లోగా రిజిస్టరు చేయించుకోకుంటే వారి పాస్ పోర్టు, వీసాలను జారీ చేయమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే ఎన్నారైల వివాహాలను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖకి సంభందించిన డాటాబేస్ లో పొందు పరుస్తామని మనేకాగాంధీ ప్రకటించారు.
!--nextpage
అయితే ఈ విధమైన విధానాలని అమలు చేయడానికి ప్రత్యేకమైన కారణం లేకపోలేదు.ఎన్నారైలతో ఏర్పడుతున్న వివాహ వివాదాలను పరిష్కరించేందుకు ఈ విధానపరమైన చర్యలు తీసుకున్నామని మంత్రి మీడియాకి తెలిపారు.
ఎన్నారైల వివాహ వివాదాలపై తాము ఆరు లుక్ అవుట్ సర్కులర్లను జారీ చేశామని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వార మరో ఐదుగురు ఎన్నారైల పాస్ పోర్టులను రద్దు చేశామని మనేకాగాంధి వివరించారు.
ఎవరైనా సరే ఈ విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వీసాలని రద్దు చేస్తామని ప్రకటించారు.
మ్యాట్రిమోని మోసాలపై హెచ్చరిక చేసిన సజ్జనార్