“పవన్” పార్టీ ఖర్చుల కోసం ఏమి చేస్తున్నాడో తెలిస్తే “షాకే”

పొలిటికల్ పార్టీ పెట్టేయడం పెద్ద విషయం కాదు.అయితే పార్టీ పెట్టిన తరువాత దానిని సమర్ధవంతంగా నడపగలిగే సత్తా ఉండాలి.

 Pawan Kalyan Party Fund Comes From…?-TeluguStop.com

ఎంత దమ్మున్న నాయకుడైనా సరే పార్టీని నడిపించాలనే డబ్బు ఉండాల్సిందే.ఈ విషయంలో చంద్రబాబు నాయుడికి బాగా అనుభవం ఉంది.

చంద్రబాబు అధికారంలో లేని సమయంలో మనీ మానేజ్ మెంట్ పార్టీ ని నడిపించగలిగే డబ్బుని సుజనా చౌదరి.మరియు సీఎం రమేష్ లు చూసుకునే వారని అందుకే వారికి పార్టీ లో సముచిత స్థానం మంత్రి పదవులు వచ్చేలా చేశారనేది టాక్.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచీ వస్తున్నాయి.? ఒక సభ పెట్టిన ఓ మీటింగ్ పెట్టినా సరే అయ్యే ఖర్చు మాత్రం భారీగానే ఉంటుంది మరి ఎలా అంటే.

పవన్ కళ్యాణ్ చాలా సార్లు నాదగ్గర డబ్బులు లేవు.సినిమాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నాను.వాటితో రాజకీయ అవసరాలు తీర్చుకుంటాను అని తెలిపారు.అయితే పవన్ కళ్యాణ్ పెట్టిన ఆవిర్భావ సభకు కానీ , వైజాగ్ లో పెట్టిన భారీ భహిరంగ సభకి కానీ కోట్లరూపాయల మేర ఖర్చు అవుతుంది మరి ఈ ఖర్చులని ఎవరు భరిస్తున్నారు.

ఎక్కడి నుంచీ డబ్బు వస్తోందంటే.ఓ ఆసక్తి కరమైన విషయం మాత్రం చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.

పవన్ కళ్యాణ్ కి రియల్ ఎస్టేట్ ద్వారా కూడా కొంత వరకు లాభం చేకూరినట్టు టాక్.

పార్టీ కోసం ఎంతో కొంత సేకరించడానికి సినిమా కన్నా తేలికైన రంగం.రియల్ ఎస్టేట్ అన్న విషయం పవన్ కళ్యాణ్ ముందే గ్రహించాడని అందుకే భారీ పెట్టుబడులు వాటిలో పెట్టాడని అంటారు.

పీవీపి తో కలిసి కొంత వరకు రియల్ ఎస్టేట్ లో బాగానే సంపాదించాడని.ఆ తరువాత కొంతమంది తెలిసిన వ్యక్తులతో కలిసి ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి బాగానే ఆర్జించారు అని టాక్.

ముఖ్యంగా అమరావతి ప్రాంతం దగ్గర కూడా మంత్రుల సాయంతో భూమిని కొనుగోలు చేసి అక్కడ పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది.మొత్తానికి పవన్ మాత్రం పార్టీ మనుగడకి ఏమి చేయాలో అన్ని పక్కాగా ప్లాన్డ్ గా చేస్తున్నాడని తెలుస్తోంది…బాబు గారి ముందు చూపు పవన్ కళ్యాణ్ కి బాగానే అబ్బిందని చెప్పచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube