సాధారణంగా క్యారెట్ మనకు మంచి చేస్తుందని కాస్త ఎక్కువగానే తింటూ ఉంటాం.అయితే క్యారెట్ ని ఎక్కువగా తినటం వలన అనేక అనర్ధాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్యారెట్ ఎక్కువగా తినటం వలన ఆందోళన,రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని అంటున్నారు.ముఖ్యంగా పాలు ఇచ్చే తల్లులు క్యారెట్ తీసుకోకుండా ఉంటేనే మంచిదని అంటున్నారు నిపుణులు.
క్యారెట్ ఎక్కువగా తీసుకోవటం వలన తల్లి పాల రుచి కూడా మారుతుందని దాంతో పిల్లలు పాలు త్రాగటానికి మారాం చేస్తారని అంటున్నారు
హార్మోన్స్ సమస్యతో బాధపడేవారు మాత్రం డాక్టర్ సలహా లేకుండా క్యారెట్ ని తీసుకోకూడదు.ఇప్పుడు క్యారెట్ ఎక్కువగా తినటం వలన కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం.
క్యారెట్ లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది.అది మన శరీరంలో విటమిన్ A గా మారుతుంది.
ప్రతి రోజు రెండు కేరట్స్ తింటే శరీరానికి అవసరమైన విటమిన్ A అందుతుంది.అయితే చిన్న పిల్లలకు చాలా తక్కువ మోతాదులో సరిపోతుంది.కాబట్టి రోజులో క్యారెట్ పెడితే సరిపోతుంది
క్యారెట్ లో షుగర్ కంటెంట్, హై గ్లిసానిక్స్ 97 శాతం ఉంటుంది.ఇది గ్లూకోజ్ గా మారడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.అందువల్ల మధుమేహం ఉన్నవారు చాలా తక్కువ మోతాదులో ఉడికించి మాత్రమే తీసుకోవాలి.క్యారెట్ లోని బీటాకెరోటిన్, కెరోటినాయిడ్స్ వల్ల చర్మ రంగులో మార్పు వస్తుంది.పసుపు రంగులో నుండి ఆరంజ్ కలర్ లోకి మారుతుంది.అరచేతులు, ముఖం, చేతులు, పాదాలలో కలర్ మారుతుంది.
ఇక కారెట్స్ లో కార్బోహైడ్రేడ్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణాశయంలో జీర్ణం అవక కోలన్ లో నిల్వ ఉండడం వల్ల పేగుల్లో గ్యాస్ ఏర్పడుతుంది.దాంతో స్టమక్ ప్రంప్స్, బ్లోటింగ్, గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి.