దేవసేన మీద చీమ కూడా పడకుండా చూసుకునేందుకు బాహుబలి ఉన్నాడు.కాని రియల్ లైఫ్ లో దేవసేనకు అలాంటి కంఫర్ట్ లేదు.
అందుకే అనుష్కని అడ్డుకున్నారు పోలీసులు.ఆమె కారవన్ ని ఆపేసి RTO ఆఫీసులో పడేసారు.
అనుష్క తప్పతాగి కనిబడిందేమో అనుకునేరు.స్వీటి తప్పు మాత్రం కాదులేండి.
తప్పు ఆమె డ్రైవర్ ది.ఆమె మీద ఎలాంటి కేసు నమోదు అవలేదు.ఆ డ్రైవర్ మీదే చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు.ఇంతకి ఏం జరిగిందంటే …
అనుష్క ప్రస్తుతం పొలాచ్చిలో ఉంది.భాగమతి షూటింగ్ లో బిజీగా ఉంది.సాధరణంగా అయితే హీరోహీరోయిన్లు షూటింగ్ స్పాట్ దాకా తమ సొంత కారు వాడతారు.
షూటింగ్ స్పాట్ లోనే కారవాన్ వాడతారు.దాన్ని పర్సనల్ పనులకి ఉపయోగించరు.
కాని ఏం అవసరం పడిందో, అనుష్క తను బస చేస్తున్న హోటల్ నుంచి షూటింగ్ స్పాట్ కి కారావాన్ నే వాడుతోంది.పోలీసుల ఆ వాహానాన్ని ఆపి పేపర్స్ అడిగేసరికి నీళ్ళు మింగాడు డ్రైవర్.
ఆ కారావాన్ కి ఎలాంటి పేపర్స్ లేవు.ఇంకేముంది, సీజ్ చేసి RTO ఆఫీసులో పడేసారు.
ఇక భాగమతి విషయానికి వస్తే, పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ దీనికి దర్శకుడు.యూవి క్రియేషన్స్ వారు ఈ సినిమాని పెద్ద బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం తమిళనడులోని పొలాచ్చిలో ఓ కీలకమైన షెడ్యూల్ నడుస్తోంది.సినిమాని త్వరగా పూర్తి చేసి, ఆగష్టు చివర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం
.