ఖైదీనం.150 రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీనం.150 షూటింగ్ చివరి దశల్లో ఉంది.వచ్చే నెలలో ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేయనున్నారు.ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరత్వరగా పూర్తి చేసి జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను బాక్సాఫీస్ బరిలో దింపనున్నారు.

 Release Date Confirmed For Khaidi No.150-TeluguStop.com

ఇక్కడివరకు మీకు తెలిసిన విషయాలే.ఇక కొత్త వార్త ఏమిటంటే, ఈ చిత్రం ముందు చెప్పినట్లుగా జనవరి 13కి రావట్లేదు.అవును, రిలీజ్ డేట్ లో చిన్న తేడా!

ఖైదీనం.150 ప్రపంచవ్యాప్తంగా జనవరి 11వ తేదిన విడుదల కాబోతోంది.ఈ వార్తలో పెద్దగా మార్పులుండవు.త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటిస్తారు దర్శకనిర్మాతలు.దీంతో సంక్రాంతి బరిలో మూడు సినిమాలు ఖరారైపోయాయి.జనవరి 11న ఖైదీనం 150, 12న గౌతమీపుత్ర శాతకర్ణి, 13 లేదా 14న శతమానంభవతి.

వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక.రామ్ చరణ్ నిర్మాత.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube