బోయపాటి శ్రీను అనగానే మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా ఆయన తెరకెక్కించిన యాక్షన్ సినిమాలు గుర్తుకువస్తాయి.కత్తులు .
తుపాకులతో చేసే ఛేజింగులు కళ్లముందు కదలాడతాయి.అలాంటి బోయపాటి ఒక ప్రేమకథను తెరకెక్కించనున్నాడనే వార్త అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయపాటి ఒక సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే.ఇది ప్రేమ కథాంశమని తెలుస్తోంది.
బోయపాటి తన మార్క్ కి విభిన్నమైన లైన్ ఎంచుకోవడం ఒక విశేషమైతే, ‘సరైనోడు’ తరువాత ఆయన సాయిశ్రీనివాస్ తో సినిమా చేస్తుండటం మరో విశేషం.బోయపాటికి భారీ పారితోషికం ఆఫర్ చేయబడిందనీ, అందుకే ఆయన ఈ సినిమాను అంగీకరించాడనే ఒక వార్త షికారు చేస్తోంది.
అయితే ఈ ప్రచారాన్ని ఆయన సన్నిహితులు ఖండిస్తున్నారు.‘సరైనోడు’ కంటే ముందుగానే బోయపాటి ఈ సినిమా చేయడానికి కమిట్ కావడం జరిగిందని వాళ్లు చెబుతున్నారు.భారీ పరాజయంతో డీలాపడిన సాయిశ్రీనివాస్ కి, బోయపాటి భారీ హిట్ ను ఇస్తాడేమో చూడాలి.