ప్రస్తుత కాలంలో కొందరు తల్లులు చేసేటటువంటి పనులు తల్లి అనే మాటకి కళంకం తెస్తున్నాయి.నవమాసాలు మోసి కానీ పెంచిన కొడుకుకి చిన్న దెబ్బ తగిలితేనే తల్లి ప్రాణం విలవిలలాడిపోతుందంటారు.
కానీ ఓ మహిళ తన చిన్న చిన్న సరదాలకు అడ్డుగా ఉన్నాడని ముక్కుపచ్చలారని తన కొడుకుని ఊపిరి ఆడకుండా చేసి చంపేసిన ఘటన ఐరోపా దేశం లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఐరోపా దేశంలోని ఆసియా ప్రాంతంలో చియారా అనే మహిళ తన మూడు సంవత్సరాలు కలిగినటువంటి కొడుకుతో నివాసం ఉంటోంది.
అయితే ఈమె తరచుగా జల్సాగా తిరుగుతూ హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది.అయితే ఈ మధ్య కాలంలో తన ఎంజాయ్ మెంట్ కి తన కొడుకు అడ్డు వస్తున్నాడని ఏకంగా ముక్కు పచ్చలు కూడా ఆరనటువంటి మూడేళ్ల బిడ్డని చంపేందుకు ప్లాన్ చేసింది.
ఇందులో భాగంగా ఇంట్లో ఎవరు లేని సమయంలో తన కన్న కొడుకుని హత్య చేసి దగ్గరలో ఉన్నటువంటి నదిలో విసిరేసింది.
దీంతో ఏమి ఏమి ఎరగనట్లు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించి కపట కన్నీరు కార్చింది.దీంతో పోలీసులు ఆమెపై నిఘా ఉంచారు.ఈ విచారణలో భాగంగా చియార నీ అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించింది.
చూద్దాం పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరచగా ఆమెకు ఏకంగా 33 ఏళ్లు జైలుశిక్ష విధించింది.