నేడు హైదరాబాద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు.ఇవాళ రాత్రి 10.15 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి చేరుకోనున్నారు.
రేపు ఉదయం 7.50 గంటల నుంచి 10.30 వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించే ఇండియన్ పోలీస్ సర్వీస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.ఈ పరేడ్ లో 29 మంది విదేశీ ఆఫీసర్ ట్రైనీలతో పాటు మొత్తం 195 మంది ఆఫీసర్ ట్రైనీలు పాల్గొననున్న సంగతి తెలిసిందే.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమిత్ షా అధికారులతో సమావేశం కానున్నారు.అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.