ప్రముఖ గాయనీ వాణీ జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో పని మనిషి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
పని మనిషి చెప్పిన వివరాల ప్రకారం తలుపు ఎంత కొట్టినా తీయకపోవడంతో బంధువులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.బంధువులు డోర్ బద్దలు కొట్టుకోని లోపలికి వెళ్లగా వాణీ జయరాం రక్తపు మడుగులో కనిపించారు.
వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని వెల్లడించారు.గ్లాస్ టేబుల్ పై పడటంతో వాణీ జయరాం తలకు బలమైన గాయమైనట్లు సమాచారం.