సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి దళితులపై పలువురు యాదవ కుటుంబీకులు జరిపిన దాడి సంఘటనపై పలువురిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఆదివారం రాత్రి భయ్యా భద్రయ్య, వేల్పుల రమేష్ యాదవ్,వట్టే గణేష్ యాదవులు, కొంతమందితో కలిసి దళిత కుటుంబాలకు చెందిన మల్లెపాక రామచంద్రు,రామాంజనేయులు,ఎల్లమ్మ, రంజిత్,గుడిపాటి సుమన్ లను హత్యాయత్నం చేసినట్లు మల్లెపాక ఎల్లమ్మ తుంగతుర్తి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు పై ముగ్గురిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకొని, విచారణ జరుపుతున్నట్లు తుంగతుర్తి ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.