పిజ్జా ఆర్డర్ క్యాన్సిల్ అయినందుకు జొమాటోకి భారీ ఫైన్.. ఎంతంటే?

జొమాటో సంస్థకు ఒక వినియోగదారుడు భారీ షాక్ ఇచ్చాడు.జొమాటో తాను ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేసిందని ఇటీవల కన్స్యూమర్ ఫోరంను అజయ్‌శేఖర్‌ శర్మ అనే వినియోగదారుడు ఆశ్రయించాడు.

 Zomato Has A Huge Fine For Canceling A Pizza Order How Much, Pizza, Delivery, Or-TeluguStop.com

బాగా ఆకలయ్యి పిజ్జా ఆర్డర్ చేస్తే జొమాటో ఆ ఆర్డర్ ను రిసీవ్ చేసుకుందని.కానీ తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేసిందని అతడు వాపోయాడు.

అయితే ఇరు పార్టీల వాదనలు విన్న కన్స్యూమర్ ఫోరం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.పిజ్జా ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసినందుకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు రూ.10 వేలు జరిమానా విధించింది.అంతేకాదు, ఫిర్యాదుదారుకు 30 రోజుల్లోగా ఒక మీల్‌ ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.చండీగఢ్‌కు చెందిన అజయ్‌ శేఖర్‌ శర్మ జొమాటోలో ‘ఆన్‌టైమ్‌ / ఫ్రీ డెలివరీ’ స్కీమ్స్‌లో ఫ్రీ డెలివరీగా పిజ్జా ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు.రాత్రి 10.15 గంటల ప్రాంతంలో ఆర్డర్ ప్లేస్ చేయగా.10.30 గంటల సమయంలో ఆర్డర్‌ క్యాన్సిల్ అయినట్టు అతను గుర్తించాడు.అయితే ఉచితంగా ఆర్డర్ డెలివరీ చేయాలని తాను విజ్ఞప్తి చేసినప్పుడు.దీన్ని కావాలనే జొమాటో క్యాన్సిల్ చేసిందని అతడు వాదించాడు.

డెలివరీ చేయలేనప్పుడు అసలు బుకింగ్‌ ఎందుకు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.సేవలు అందించడంలో టొమాటో అనైతికంగా ప్రవర్తిస్తోందని.

పది రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే తప్ప డెలివరీ చేయడం లేదని అతడు ఆరోపించాడు.అయితే అతని వాదనతో ఏకీభవించిన కన్స్యూమర్ ఫోరం జొమాటోకు ఫైన్ విధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube