భారత్‌తో బ్రిటన్‌కు టూవే రిలేషన్ వుండాలి: రిషి సునాక్ వ్యాఖ్యలు

యూకే – భారత్ సంబంధాన్ని టూ వే ఎక్స్చేంజ్‌‌గా మార్పిడి చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్ధి రిషి సునాక్.ఇది యూకే విద్యార్ధులకు, భారతదేశంలోని కంపెనీలకు సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుందన్నారు.

 I Want To Change Uk-india Relationship To Make It More Two-way: Britain's Pm Can-TeluguStop.com

సోమవారం సాయంత్రం ఉత్తర లండన్‌లో కన్జర్వేటివ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐఎన్) డయాస్పోరా ఆర్గనైజేషన్ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో రిషి సునాక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

నమస్తే, సలాం, ఖేమ్ చో అంటూ పలకరించారు.యూకే – భారత్‌ల మధ్య సంబంధాలు చాలా ముఖ్యమైనవని.

సీఎఫ్ఐఎన్ కో చైర్ రీనా రేంజర్ అడిగిన ప్రశ్నకు రిషి సమాధానమిచ్చారు.

భారతదేశంలో వస్తువులను విక్రయించడానికి , పనులు చేయడానికి యూకేకి వున్న అవకాశాలు గురించి మనందరికీ బాగా తెలుసునని రిషి సునాక్ పేర్కొన్నారు.

అయితే వాస్తవానికి తాము ఆ సంబంధాన్ని భిన్నంగా చూడాలని.ఎందుకంటే యూకేలో వున్న మనం భారత్ నుంచి నేర్చుకోగలిగే అపారమైన మొత్తం వుందని ఆయన అన్నారు.మన విద్యార్ధులు భారతదేశానికి వెళ్లి నేర్చుకోవడం సులభమని .అలాగే మన కంపెనీలు కూడా భారతీయ కంపెనీలతో కలిసి పనిచేయడం కూడా సులభమని సునాక్ అన్నారు.అయితే ఇది కేవలం కేవలం వన్‌ వే రిలేషన్ కాదు.టూ వే రిలేషన్‌గా ఆయన అభివర్ణించారు.తాను ఈ బంధంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నానని సునాక్ స్పష్టం చేశారు.

Telugu Britainspm, China, Changeuk, Uk India-Telugu NRI

ఇక చైనాపై మరోసారి విమర్శలు గుప్పించారు రిషి .డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుందన్న తన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు.చైనా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మన ఆర్ధిక, జాతీయ భద్రతకు అతిపెద్ద ముప్పని రిషి సునాక్ హెచ్చరించారు.

ప్రధాన మంత్రిగా.మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఈ దేశాన్ని సురక్షితంగా వుంచడానికి ఏమైనా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube