భారత్‌తో బ్రిటన్‌కు టూవే రిలేషన్ వుండాలి: రిషి సునాక్ వ్యాఖ్యలు
TeluguStop.com
యూకే - భారత్ సంబంధాన్ని టూ వే ఎక్స్చేంజ్‌గా మార్పిడి చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్ధి రిషి సునాక్.
ఇది యూకే విద్యార్ధులకు, భారతదేశంలోని కంపెనీలకు సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుందన్నారు.
సోమవారం సాయంత్రం ఉత్తర లండన్‌లో కన్జర్వేటివ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐఎన్) డయాస్పోరా ఆర్గనైజేషన్ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో రిషి సునాక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నమస్తే, సలాం, ఖేమ్ చో అంటూ పలకరించారు.
యూకే - భారత్‌ల మధ్య సంబంధాలు చాలా ముఖ్యమైనవని.సీఎఫ్ఐఎన్ కో చైర్ రీనా రేంజర్ అడిగిన ప్రశ్నకు రిషి సమాధానమిచ్చారు.
భారతదేశంలో వస్తువులను విక్రయించడానికి , పనులు చేయడానికి యూకేకి వున్న అవకాశాలు గురించి మనందరికీ బాగా తెలుసునని రిషి సునాక్ పేర్కొన్నారు.
అయితే వాస్తవానికి తాము ఆ సంబంధాన్ని భిన్నంగా చూడాలని.ఎందుకంటే యూకేలో వున్న మనం భారత్ నుంచి నేర్చుకోగలిగే అపారమైన మొత్తం వుందని ఆయన అన్నారు.
మన విద్యార్ధులు భారతదేశానికి వెళ్లి నేర్చుకోవడం సులభమని .అలాగే మన కంపెనీలు కూడా భారతీయ కంపెనీలతో కలిసి పనిచేయడం కూడా సులభమని సునాక్ అన్నారు.
అయితే ఇది కేవలం కేవలం వన్ వే రిలేషన్ కాదు.టూ వే రిలేషన్‌గా ఆయన అభివర్ణించారు.
తాను ఈ బంధంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నానని సునాక్ స్పష్టం చేశారు. """/"/
ఇక చైనాపై మరోసారి విమర్శలు గుప్పించారు రిషి .
డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుందన్న తన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు.
చైనా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మన ఆర్ధిక, జాతీయ భద్రతకు అతిపెద్ద ముప్పని రిషి సునాక్ హెచ్చరించారు.
ప్రధాన మంత్రిగా.మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఈ దేశాన్ని సురక్షితంగా వుంచడానికి ఏమైనా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?