క్వాలిఫైయర్ మ్యాచ్లలో సత్తా చాటుతున్న జింబాబ్వే.. సికిందర్ రాజా సరికొత్త రికార్డు..!

భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో( One Day World Cup ) పాల్గొనేందుకు 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తే, మిగిలి ఉన్న 2 జట్ల కోసం పది జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా ఒమన్-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో జింబాబ్వే( Zimbabwe ) విజయం సాధించి సూపర్ సిక్స్ దశలో ఆరు పాయింట్లతో టాప్ ర్యాంకు లోకి వచ్చింది.జింబాబ్వే రన్ రేట్ (0.75) గా ఉంది.ఇదే ఫామ్ కొనసాగిస్తే ఖచ్చితంగా జింబాబ్వే వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తుంది.

 Zimbabwe Sikandar Raza Becomes The Fastest To Complete 4000 Runs In Terms Of Inn-TeluguStop.com

క్రికెట్ నిపుణులు వన్డే వరల్డ్ కప్ రెండు వ్యక్తుల కోసం వెస్టిండీస్, శ్రీలంక పోటీ పడతాయని అంచనా వేశారు.కానీ వెస్టిండీస్ అర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.వెస్టిండీస్ అర్హత సాధించాలంటే మిగిలి ఉన్న మూడు మ్యాచ్లలో భారీ విజయాలు సాధించాలి.

వెస్టిండీస్ ఒక్క మ్యాచ్ ఓడిన ఆశలు గల్లంతే.ఇక శ్రీలంక పరిస్థితి బాగానే ఉన్న రన్ రేట్ పరంగా కాస్త వెనుకబడి ఉంది.

శ్రీలంక జట్టు అర్హత సాధించే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి.

జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రాజా( Sikandar Raja ) క్వాలిఫయర్ మ్యాచ్లలో అద్భుత ఆటను ప్రదర్శిస్తున్నాడు.తాజాగా ఒమన్-జింబాబ్వే మ్యాచ్ తో సికిందర్ రాజా సరికొత్త రికార్డు సృష్టించాడు.జింబాబ్వే తరఫున నాలుగు వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.127 ఇన్నింగ్స్ లలో ఈ అరుదైన ఘనత సాధించాడు.గ్రాండ్ ఫ్లవర్ 23 ఏళ్ల కిందట 128 ఇన్నింగ్స్ లలో 4000 పరుగులు చేసి సృష్టించిన రికార్డును సికిందర్ రాజా బ్రేక్ చేశాడు.

సికిందర్ రాజా ఫామ్ చూస్తుంటే కచ్చితంగా జింబాబ్వే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో బెర్త్ కన్ఫామ్ చేసుకోవడం పక్క అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube