సినిమాల తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలా లేదా ఇంకేమైనా చేయాలా అని ఆలోచన వచ్చినప్పుడు ఎన్టీఆర్ కి చురుగ్గా ఒక ఐడియా వచ్చింది అదే రాజకీయాలు.( Politics ) నిజానికి ఎన్టీఆర్ కి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు తొలినాళ్ల నుంచి ఆయనకు మీడియా నా జర్నలిజం అన్న రాజకీయాల గురించి మాట్లాడుకోవడం అన్నా కూడా ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు.
ఈ విషయం చెప్పింది మరి ఎవరో కాదు స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) ఒక మీడియా సమావేశంలో చెప్పారు.తనకు మాత్రమే మొదటి నుంచి రాజకీయాలపై అవగాహన ఉండేదని అప్పటి ముఖ్యమంత్రులతో తనకు స్నేహం కూడా ఉండేదని అక్కినేని ఓ సందర్భంగా చెప్పారు.
అక్కినేని మరియు ఎన్టీఆర్( Senior NTR ) కలిసి కొన్ని సినిమాల్లో పనిచేస్తున్న సమయంలో విరామ సమయంలో రాజకీయం గురించి మాట్లాడితే రూపాయి పనికిరాని ఈ రాజకీయాలతో మనకు ఏం సంబంధం బ్రదర్ అంటూ కొట్టి పారేశారు అనే విషయం కూడా అక్కినేని ఆ మీడియా సమావేశంలో గుర్తు చేసుకున్నారు.అయితే ఎలాంటి రాజకీయ అనుభవం కానీ ఆసక్తి కానీ లేని ఎన్టీఆర్ ఏకంగా రాజకీయ పార్టీ పెట్టడం గురించి తనతో మాట్లాడినప్పుడు తనకు చాలా ఆశ్చర్యం వేసిందని కూడా చెప్పారు.ఇక చాలాసార్లు ఎన్టీఆర్ తనతో ఒక మాట అంటూ ఉండేవారని వార్తలు మనం సృష్టించాలే కానీ మనం వార్తల్లో వ్యక్తులం కాకూడదు అంటూ చెప్పిన మాట కూడా గుర్తు చేసుకున్నారు.
ఇక ప్రతిరోజు ఉదయం ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తికి ఇంటలిజెన్స్ విభాగం మరియు సమాచార శాఖ కొన్ని వివరాలు అందిస్తూ ఉంటారని వాటిని కూడా దాటి ఒక వ్యక్తి ఆలోచించగలిగినప్పుడే తన రాజకీయ భవిష్యత్తు( Political Future ) కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ముందుకు వెళుతుంది అని అది సరిగ్గా చేయలేకపోవడం వల్లే ఎన్టీఆర్ పూర్తిస్థాయి రాజకీయ పతనం చూశారని అక్కినేని అభిప్రాయపడ్డారు.ఎన్టీఆర్ ఒక్కసారిగా రాజకీయాల్లోకి రావాలి అనుకున్నా తరువాత అక్కినేని కోసం చాలా సార్లు కబురు పెట్టారు.కానీ ఎందుకో అక్కినేని చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి రాజకీయాలు తనకు సరిపడవు అని నిర్ణయించుకొని ఎన్టీఆర్ కి బదులు చెప్పలేదు.
అలాగే అక్కినేని కన్నా కూడా చాలామంది నటులు ఎన్టీఆర్ తో కలిసి నడుస్తారు అనుకున్నా కూడా అది కూడా జరగలేదు.ఎన్టీఆర్ హయాంలో కన్నా బాబు హయాంలోనే ఎక్కువగా రాజకీయ నాయకులుగా మారారు సినీ తారలు.