వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Leader Pawan Kalyan ) వ్యూహరచన చేస్తూ వచ్చారు.అందులో భాగంగానే వారాహి విజయ యాత్రను ప్రారంభించి ఏపీ రాజకీయాలను వేడెక్కించారు.
మొదటి దశలో భాగంగా జూన్ 14న ఉభయగోదావరి జిల్లాలే టార్గెట్ గా ప్రారంభం అయిన ఈ యాత్ర ప్రతిరోజూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే నిలుస్తూ వచ్చింది.ఎందుకంటే ఈ యాత్రలో భాగంగా పవన్ చేసిన వ్యాఖ్యలు అటు వైసీపీని కలవరపెడితే.
టీడీపీని డైలమాలో పడేశాయి.టీడీపీతో పొత్తు ( TDP alliance With Janasena )విషయంలో ఎటు తేల్చకుండా పవన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీని గందరగోళానికి గురి చేయగా.
తనకు సిఎం ఛాన్స్ ఇవ్వండి అంటూ మరోవిధంగా పవన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి.
ఇలా హాట్ హాట్ వ్యాఖ్యలతో పవన్ మొదటి దశ వారాహి యాత్ర( Varahi Yatra ) ఎట్టకేలకు నేటితో ముగిసింది.ఉభయగోదావరి జిల్లాలో వారాహి యాత్ర కారణంగా జనసేనకు మైలేజ్ పెరిగిందని ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమౌతోంది.ఇదిలా ఉంచితే మొదటి దశ యాత్ర ముగింపు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం( Bhimavaram )లో నేడు జనసేన బహిరంగ సభ జరగనుంది.
ఈ సభలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.గత ఎన్నికల్లో భీమవరం మరియు గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేసి పవన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.
దాంతో ఈసారి పవన్ ఏ స్థానాన్ని ఎంచుకోబోతున్నారు ? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం పవన్ మరోసారి భీమవరం నుంచే పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయట.ఒక చోటు నుంచే పోటీకి దిగుతారా లేదా గత ఎన్నికల్లో మాదిరి రెండు చోట్లను ఎంచుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి విషయం ఏమిటంటే పొత్తు విషయంలో ఇంకా పూర్తి స్పస్టతనివ్వని జనసేనాని పార్టీ పోటీ చేస్తే స్థానాలపై కూడా ఏమైనా ప్రస్తావిస్తరేమో చూడాలి.
మొత్తానికి వారాహి యాత్ర మొదటిదశలో కొంత క్లారిటీ మరికొంత సందేహాలను వదిలిన జనసేనాని రెండవదశ యాత్రలో ఇంకెంతటి పోలిటికల్ హీట్( Political Heat ) పెంచుతారో చూడాలి.