కరణం వర్సెస్ ఆమంచి ? ఫ్లెక్సీల గొడవతో వీధికెక్కిన వర్గ పోరు ?

మొదటి నుంచి ఊహించినట్టుగానే, వైసీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతూ వీధినపడి పార్టీ పరువుని బజారున పడేస్తున్నాయి.ముఖ్యంగా, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి మధ్య పొసగడంలేదు.

 Flexy Controversy Between Karanam Balaram Amanchi Krishnamohan Followers, Ysrcp,-TeluguStop.com

ఎక్కడ చూసినా, వివాదాలు చుట్టుముట్టేస్తున్నాయి.ఈ గ్రూపు రాజకీయాలతో పార్టీ అధిష్టానానికి తలనొప్పులు వచ్చిపడుతున్నాయి.

ఇదిలా ఉంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం తారస్థాయికి వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది.వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది.

చీరాల గడియార స్తంభం వద్ద ఇరు వర్గాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు.వైయస్ వర్ధంతి పురస్కరించుకుని ఫ్లెక్సీలు కట్టే విషయంలో, కరణం బలరాం ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య వివాదం చెలరేగింది.

వైఎస్ఆర్ విగ్రహం వద్ద కరణం వర్గీయులు ముందుగా ఫ్లెక్సీలు కట్టగా, అక్కడే తమ ఫ్లెక్సీలు కట్టాలంటూ ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు ఆందోళనకు దిగడంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వివాదాన్ని సర్దుబాటు చేశారు.

పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఇరువర్గాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వేర్వేరు సమయాల్లో అనుమతులు ఇచ్చారు.ముందుగా కరణం బలరాం వర్గీయులు ఉదయం నివాళులు అర్పిస్తే, ఆ తర్వాత కృష్ణమోహన్ వర్గీయులు నివాళులు అర్పించే విధంగా అనుమతులు ఇవ్వడంతో సమస్య కాస్త సద్దుమణిగింది.

ఆమంచి కృష్ణం మోహన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు.ఎప్పటి నుంచో వారి మధ్య వైరం కొనసాగుతూ వస్తోంది.

ఈ క్రమంలో ఇద్దరూ పార్టీకి అనుకూలంగా ఉన్నా, వివాదాలు మాత్రం సమిసిపోలేదు.ఇప్పటికే ఇద్దరు నాయకుల మధ్య చెలరేగిన ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తూనే వస్తోంది.

ఈమేరకు ఆమంచి కృష్ణమోహన్ ఇదే జిల్లాలో ఉన్న పర్చూరు నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించేందుకు ప్రయత్నిస్తున్నా, కృష్ణ మోహన్ మాత్రం చీరాలలోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పుడు మరోసారి ఇద్దరు నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం బయటపడటంతో ఇప్పుడు హైకమాండ్ రంగంలోకి దిగి, ఇద్దరు నేతల మధ్య రాజీ చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది కేవలం చీరాల నియోజకవర్గం లోనే కాకుండా చాలా నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగుతూ వస్తుండడంతో అధిష్టానం ఈ వ్యవహారాలపై సీరియస్ గా స్పందించే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube