తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం కోరటాల శివ డైరెక్షన్ లో “దేవర”( Devara ) అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని అందుకోవాలని ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకి ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యంగ్ హీరోలు కూడా అభిమానులుగా మారిన విషయం మనలో చాలా మందికి తెలియదు.
నిజానికి యంగ్ హీరోలుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందుతున్న నాగశౌర్య( Naga Shaurya ) అలాగే విశ్వక్ సేన్ లాంటి నటులు ఆయనకి అభిమానులు గా మారారు.విశ్వక్ సేన్( Vishwaksen ) ఓపెన్ గా ఈ విషయాన్ని చాలా సార్లు స్టేజ్ మీద చెప్పడం మనం చూశాం.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా ఏంటో చూపించుకోవడం ఒక్కటే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.అందులో భాగంగానే దేవర సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు…ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో వార్ 2( War 2 ) అనే సినిమాని కూడా చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలతో తనను తాను స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్( Director Prashant Neel ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు…చూడాలి మరి ఫ్యూచర్ ఎన్టీయార్ ఇంకా ఎన్ని రికార్డ్ లను నమోదు చేసుకుంటాడు అనేది…ఇక ఇప్పటి వరకైతే చాలా మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు…
.