రాజకీయాలకు దూరం దూరం అంటూనే ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించే విధంగా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు.చిరంజీవి చాలా కాలం గా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
తన తమ్ముడు జనసేన పార్టీ స్థాపించి జనాల్లోకి వెళ్తున్నా, ఎప్పుడు బహిరంగంగా మద్దతు ప్రకటించని చిరంజీవి, వైసిపి ప్రభుత్వం పైన జగన్ పైనా, సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశంసలు కురిపిస్తూనే వచ్చారు.అనేకసార్లు తాడేపల్లికి వచ్చి మరి జగన్ ను కలిశారు.
దీనికి తగ్గట్టుగానే వైసిపి కూడా మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఎప్పుడు సానుకూలంగానే ఉంటోంది.పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న చిరు విషయంలో సానుకూల వైఖరిని కనబరిస్తోంది.
అయితే ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో ఏపీ రాజకీయ అంశాలపై చిరంజీవి స్పందిస్తూ, వైసిపి ప్రభుత్వం( YCP PARTY ) పై విమర్శలు చేయడంతో ఆ పార్టీ నాయకులు చిరంజీవి పైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

తాజాగా ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు( Ambati rambabu ) ఈ వ్యవహారం పై స్పందించారు.తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పాల్సింది అన్నయ్య అంటూ అంబటి అన్నారు.బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారో లేదో చిరంజీవి చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు.
చిరంజీవి ఏం మాట్లాడారో చూసి రేపు మాట్లాడుతానని అంబటి ప్రకటించారు.పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబును పోలిన పాత్రలో పృథ్వీ నటించి అందులో శ్యాంబాబు పాత్రను ఆయన చేశారు.
దీనిపైనే వివాదం మొదలైంది.పవన్ సినిమా రెమ్యునరేషన్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలను కలిసి ఇటీవల అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారాలపై చిరంజీవి స్పందించారు.ఓ సినిమా ఫంక్షన్ హాల్ లో మాట్లాడిన చిరంజీవి నటీనటుల రెమ్యూనరేషన్ గురించి కాకుండా, ప్రజలకు మంచి చేయడంపై ఆలోచించాలని అన్నారు.

మీలాంటి వాళ్ళు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి ప్రాజెక్టులు , ఉద్యోగ , ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి .పేదవారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి.అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు.అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మోత్సవం లాగా సినీ పరిశ్రమ మీద పడతారేంటి అంటూ చిరంజీవి వ్యాఖ్యానించడంపై వైసీపీ నాయకులు అంతే స్థాయిలో చిరంజీవి విమర్శలు ఎక్కువ పెట్టారు.
ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఈ విషయంలో ధర్మం ఏమిటో చిరంజీవి( Chiranjeevi ) చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
.