తెలంగాణ ( Telangana ) లో గృహలక్ష్మి పథకం కోసం జనాలంతా గందరగోళం చెందుతున్నారు.కులం, ఆదాయ సర్టిఫికెట్ల కోసం తాసిల్దార్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు.
ఆగస్టు 10 చివరి తేదీ కావడంతో ఆందోళన చెందుతున్నారు.div class=”middlecontentimg”>
ఈ తరుణంలోనే గృహలక్ష్మి పథకం ( Gruhalakshmi scheme ) గురించి ముఖ్యమైన విషయాలు చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మీడియాతో మాట్లాడుతూ.దరఖాస్తులు చేసుకునే విషయంలో ప్రతిపక్షాలు కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.ఇండ్లు లేని నిరుపేదల కొరకు ఖాళీ స్థలం నుండి సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో మూడు లక్షల ఆర్థిక సాయం తప్పనిసరిగా అందిస్తుందన్నారు.
మీ గ్రామాల్లో ఉండే పాత ఇల్లు కానీ స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు.ఇంటి నెంబర్ కూడా లేకుంటే మీకు కనీసం ఖాళీ స్థలం ఉన్న కానీ దరఖాస్తు చేసుకోవచ్చు.
గడువు అయిపోతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.దరఖాస్తు చేసుకునేటువంటి వ్యక్తులు వారి దరఖాస్తు ప్రతులను స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లకు పంపించవచ్చు.div class=”middlecontentimg”>
ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ, ప్రతి నియోజకవర్గంలో 3000 ఇల్లు పూర్తయిన తర్వాత రెండో దశలో గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.దశలవారీగా అర్హులైన పేద ఇంటి నిర్మాణాల కోసం గృహలక్ష్మి అమలు చేస్తున్నారు.కాబట్టి ప్రతిపక్షాలు కొన్ని పత్రికలు చేసే అసత్యాలు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర రోడ్డు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth reddy ) తెలియజేశారు.







