దర్శకుడు వంశి కి హ్యాండిచ్చిన ప్రముఖ రచయత.....ఎందుకంటే..?

దర్శకుడు వంశి ( Director Vamsi )పేరు వినేవుంటారు.లేడీస్ టైలర్, ఏప్రిల్ ఒకటో తారీకు, మహర్షి వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు వంశి.

 Yandamuri Veerendranath Hand To Director Vamsi , Director Vamsi, Yandamuri Veere-TeluguStop.com

కానీ వంశి కెరీర్ లో “అన్వేషణ” ( Anveshana )చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.వరుస సెన్సిబుల్ సినిమాలు చేసి సాఫ్ట్ డైరెక్టర్ అనిపించుకున్న వంశి, ఒక్కసారిగా అన్వేషణ తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఈ చిత్రానికి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు.వారిలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ( Director Ramgopal Varma ) కూడా ఒకరు.

అన్వేషణ చిత్రం చూసిన తరువాత రామ్ గోపాల్ వర్మ వంశి ని అభినందించారు.తరువాత అతనితో ఒక సినిమా నిర్మించారు కూడా.

తనకు ఎంతో ఇష్టమైన చిత్రాలలో అన్వేషణ ఒకటి అని చెప్తుంటారు వర్మ.

Telugu Anveshana, Ramgopal Varma, Vamsi-Movie

ఐతే ఈ సక్సెస్ఫుల్ చిత్రం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయ్.మంచుపల్లకి, ఆలాపన, చిత్రాలతో వరుస విజయాలు సాధించి ఫామ్ లో ఉన్నారు వంశి.అప్పుడే అతనితో ఒక సినిమా చేయాలనుకున్నారు నిర్మాత కామినేని ప్రసాద్( Produced Kamineni Prasad ) గారు.

వెంటనే వంశిని సంప్రదించి, తన మనసులో మాట చెప్పారు.వంశి కి తనకు నచ్చిన కథను ఎంచుకునే అవకాశం కూడా ఇచ్చారు.వంశి అప్పటివరకు చేసినవి సెన్సిబుల్ కథలే ఐనప్పటికీ, అతనికి సస్పెన్సు కథలంటే చాలా ఇష్టమట.ప్రసాద్ గారు కథ విషయం తన ఇష్టానికే వదిలేసరికి, ఒక సస్పెన్స్ స్టోరీ తీద్దాం అని నిర్ణయించుకున్నారు వంశి.

కానీ అప్పట్లో తెలుగు పరిశ్రమలో సస్పెన్స్ కథలు రాసే రచయతలు ఎవ్వరు లేరు.కాబట్టి ఆ బాధ్యతను వంశి తీసుకున్నారు.

Telugu Anveshana, Ramgopal Varma, Vamsi-Movie

వంశి అన్వేషణ కథను రాయక ముందు చాలామంది రచయితలను కథ రాయమని అడిగారట.కానీ ఎవ్వరు రాయలేకపోయారు.అప్పట్లో కన్నడలో విజయవంతమైన చిత్రం అపరిచితులు.ఈ చిత్రాన్ని రిఫరెన్స్ గా ఇచ్చారట వంశి.ఐనాసరే ఎవ్వరు ఆ కథను పూర్తి చేయలేకపోయారు.వీరిలో ప్రముఖ రచయత యండమూరి వీరేంద్రనాథ్ ( Yandamuri Virendranath )కూడా ఉన్నారు.

ఆయన ప్రయత్నమైతే చేసారు కానీ ఈ కథకు సరైన ముగింపు ఇవ్వలేకపోయారు.అందుకే వంశి అన్వేషణ క్రెడిట్స్ లో ” ఈ కథకు ఒక వెర్సన్ రాసి ఇచ్చేందుకు ప్రయత్నించినా యండమూరి వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు” అని వేశారు.

చివరకు వంశి తానే స్వయంగా కథను పూర్తి చేసారు.కార్తీక్, భానుప్రియ, శరత్ బాబు, సత్యన్నారాయణ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసినదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube