అమరగాయకుడు ఘంటసాల గారి గురించే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఆయాన గానామృతం ప్రతీ ఒక్కరి చెవులలో మారుమ్రోగుతూనే ఉంటుంది.సంగీతం నేర్చుకునే వారికి ఆయన సంగీత జీవితం, ఆయన పాడిన పాటలు ఓ పెద్ద బాలశిక్ష అనే చెప్పాలి.
గడిచిన కొంత కాలంగా ఘంటసాల కు భారతరత్న అనే డిమాండ్ విశ్వవ్యాప్తం అవుతోంది.కేంద్రం ఈ విషయంలో స్పందించే వరకూ తమ డిమాండ్ కొనసాగుతుందని అంటున్నాయి విదేశాలలో ఉన్న ప్రవాస తెలుగు సంఘాలు.
ఘంటసాల కు భారతరత్న డిమాండ్ ను మొదటి సారిగా అమెరికాలోని శంకర్ నేత్రాలయా అధ్యక్షుడు బాల ఇందుర్తి లేవనెత్తారు.
ఈ క్రమంలోనే బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకూ దాదాపు 90 కి పైగా కార్యక్రమాలు చేపట్టారు.
అంతేకాదు కేంద్రం స్పందించాలనే ఉద్దేశ్యంతో, ఘంటసాలకు మద్దతు ఇస్తూ సంతకాల సేకరణ చేపట్టారు.ఇందుకుగాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు అన్నిటిని ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు.పలు దేశాలలో ఉన్న తెలుగు సంఘాలు సైతం ఘంటసాలకు భారతరత్న అనే డిమాండ్ పై సంతకాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఏర్పాటు చేసిన అంతర్జాల సమావేశంలో పలువురు అతిధులు పాల్గొన్నారు.
పరిపూర్ణానంద స్వామీ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ గాయకుడు ఘంటసాల గారు, ఆయన దాదాపు 10 వేలకు పైగా పాటలు పాడారని, ఎన్నో భక్తి గీతాలు ఆయన గళం నుంచీ జాలువారాయని, తిరుమల తిరుపతి గర్భగుడిలో భక్తి పాటలు పాడిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించారని, అంతేకాదు స్వాతంత్ర సమరంలో పాల్గొని 18 నెలలు జైలు జీవితం గడిపారని అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కు నేను కూడా ఏకీభవిస్తునానని తెలిపారు.ఇదిలాఉంటే ఘంటసాల కు భారతరత్న డిమాండ్ కోసం క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి మద్దతు తెలిపారని నిర్వాహకులు కోరారు
.