టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గీతా గోవిందం సినిమాలో ఇంకేం ఇంకేం కావాలె అంటూ ప్రేక్షకుల మనసులను కట్టిపడేసిన పరశురామ్ తాజాగా కళావతి పాటతో అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమాకు దర్శకుడు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించడంతో పాటు మిలియన్ ల లైక్స్ తో, వ్యూస్ తో ఈ పాట రికార్డులను సృష్టిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు పరశురామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
గీతా గోవిందం సినిమా సమయంలోనే నేను ఈ సర్కారు వారి పాట సినిమా కథను సిద్ధం చేసుకున్నాను.ఈ సినిమాను మహేష్ బాబు తోనే చేయాలని అప్పుడే ఫిక్స్ అయిపోయాను అని తెలిపారు పరుశురామ్.
అందుకు అవసరమైన కసరత్తు చేయడం వల్ల ఈ సినిమాకు కాస్త గ్యాప్ వచ్చిందని వేరే ప్రాజెక్టులు లేకపోవడం,రాకపోవడం వల్ల కాదు అని తెలిపారు.
అనంతరం మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.మహేష్ బాబు గారికి కరెక్షన్ చెప్పే అలవాటు లేదు.నచ్చితే నచ్చింది అంటారు లేదంటే లేదు అంటారు.
అంతే అంతకు మించి ఆయన ఏమీ మాట్లాడలేదు, చెప్పరు.సన్నివేశాల్లో నటించినా సాంగ్ చేసిన మీకు ఓకే కదా అని మాత్రం అడుగుతారు ఆయనలో నాకు అదే నచ్చేది అని తెలిపారు పరుశురామ్.
సర్కారు వారి పాట టైటిల్ అనుకోగానే వెంటనే మహేష్ బాబు గారికి కాల్ చేసి చెప్పగానే మహేష్ బాబు గారు ఓకే అని చెప్పారు అని తెలిపాడు.ఈ సినిమా కోసం ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.