అక్కినేని నట వారసుడి గా ఇండస్ట్రీకి ఏంటి ఇచ్చిన నాగార్జున మొదట్లో చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఇక ఆ తర్వాత ఆయన హీరోగా పనికిరాడని కూడా చాలామంది విమర్శించారు.
అయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) డైరెక్షన్ లో వచ్చిన శివ సినిమాతో నాగార్జున స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ సినిమా నుంచి ఇప్పటివరకు అతను వెను తిరిగి చూడకుండా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాడు.
ఇక మొత్తానికైతే నాగార్జున ( Nagarjuna )తను స్టార్ హీరోగా మారడానికి చాలా కష్టపడ్డాడనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున పర్సనల్ లైఫ్ లో తన మొదటి భార్య అయిన లక్ష్మికి నాగ చైతన్య పుట్టిన తర్వాత విడాకులు ఇచ్చి అమల ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే… అయితే నాగచైతన్య కెరియర్ కూడా అలాగే నడుస్తుందని పలువురు సినీ విమర్శకులు వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక నాగచైతన్య కూడా సమంతని పెళ్లి చేసుకున్నాడు.
మధ్యలో వచ్చిన కొన్ని విభేదాల కారణంగా సమంత ( Samantha )నుంచి విడాకులు తీసుకున్నాడు.ఇక మొత్తానికైతే తను ఒంటరిగా లైఫ్ ను లీడ్ చేస్తూ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.
అయినప్పటికీ తనకు పెళ్లి చేయాలనే ఉద్దేశ్యంలో నాగార్జున కొన్ని సంబంధాలను కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక నాగార్జున కెరియర్లో ఎలాగైతే మొదటి భార్యకి విడాకులు ఇచ్చి రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడో నాగచైతన్య కెరియర్ కూడా అలాగే సాగుతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లైతే చేస్తున్నారు.ఇక తొందర్లోనే నాగచైతన్య తన రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికే నాగార్జున అదే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది…
.