పరువుతో బ్రతికే వారికి ఏ చిన్న అవమానం జరిగినా తట్టుకోలేరు.అలాగే వారి పరువు వేరే వారు తీసిన ఇదే స్దాయిలో స్పందిస్తారు.
ఇక ఈ సమాజంలో చీడపురుగులు చాలా మందే ఉన్నారు.
ఒకరు మంచిగా బ్రతుకుతుంటే ఓర్వలేని తనంతో వారి సంసారాల్ని నాశనం చేస్తారు.
ఇలాంటి తోడేల్ల వల్ల ప్రాణాలే పోతాయి.ప్రస్తుతం ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని ఎ.సీతారాంపురంలో జరిగింది.ఇదే గ్రామానికి చెందిన ఓ వివాహిత స్నానం చేస్తున్న సమయంలో స్దానికంగా ఉండే జయబాబు అనే వ్యక్తి వీడియో తీసి దానిని వైరల్ చేశాడట.
జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న ఆ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కేసు విచారణలో ఉండగానే ఆ వివాహిత భర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.వీరికి తెలియకుండా ఒక మూర్ఖుడు చేసిన పనికి నిండు ప్రాణం బలి అయ్యింది.
దీంతో ఆ కుటుంబం దిక్కులేనిది అయ్యింది.అందుకే ఇతరులకు మంచి చేయకపోయిన ఫర్వాలేదు.
చెడు మాత్రం చేస్తే తప్పక శిక్ష అనుభవించ వలసిందే.మీ ఇంట్లో ఉన్న ఆడవాల్లను కూడా ఇలాగే చేస్తే భరించే స్దాయి ఉంటుందా అందుకే ఇతరులను బాధపెట్టి బ్రతికే కంటే ఇలాంటి కృరమైన ఆలోచనలు ఉన్న వారు చావడం నయం అని జనం అనుకుంటున్నారట.