ఒక పెద్ద స్టార్ హీరో సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా దానికి కంటెంట్ నుంచి బడ్జెట్ వరకు చాలా ఈక్వేషన్స్ సెట్ చేయాల్సి ఉంటుంది.అవి హ్యాండిల్ చేయడం కొత్త దర్శకులకైతే దాదాపు అసాధ్యమే.
ఎంతో అనుభవం ఉంటే కానీ స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేరు అని అందరూ అంటూ ఉంటారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి టాలీవుడ్ లో కనిపించడం లేదు.
కొంతమంది సినీయర్ స్టార్ హీరోలు అలాగే స్టార్ హీరోలు కొత్త దర్శకుల కోసం సై అంటున్నారు.రిస్క్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నారు.
మరి ఇంత రిస్క్ చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరు ? వారు తీస్తున్న సినిమాలు ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) సినిమా అంటే డైరెక్టర్ ఏ రేంజ్ లో సిద్ధమై ఉండాలో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా తీస్తున్నారు చిరంజీవి.ఈ సినిమా చేయడానికి చిరంజీవి దాదాపు సాహసమే చేశారని చెప్పాలి.
ఇటీవల కాలంలో గాడ్ ఫాదర్, ఆచార్య వంటి డిజాస్టర్ లు ఎదుర్కొన్న చిరంజీవి కొత్త వారితో సినిమా తీసిన పర్వాలేదు అని, ఖచ్చితంగా కంటెంట్ బాగుండాలని అనుకున్నారు.అందుకే కేవలం బింబిసారా సినిమా తీసిన వశిష్ఠకి అవకాశం ఇచ్చారు చిరంజీవి.
మరి ఆ అవకాశాన్ని వశిష్ట ఏ మేరకు ఉపయోగించుకుంటాడో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.
ఇక రిస్క్ తీసుకోవడంలో అందరి కన్నా ముందుంటాడు ప్రభాస్.( Prabhas ) బాహుబలి కోసం దాదాపు 5 ఏళ్ల సమయం ఇచ్చి పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ప్రభాస్ సాహో సినిమా కోసం కేవలం ఒకే ఒక సినిమా అనుభవం ఉన్న సుజిత్ కి అవకాశం ఇచ్చాడు కానీ ఈ సినిమాతో అటు సుజిత్ కి, ఇటు ప్రభాస్ కి ఇద్దరికి వర్కౌట్ అవలేదు.ఆయన కూడా మళ్ళీ కేవలం జిల్ సినిమా తీసిన అనుభవం ఉన్న రాధాకృష్ణకి రాధేశ్యామ్ ( Radhe Shyam ) లాంటి ఒక కథ ఓకే చేసి మళ్లీ పరాజయాన్ని అందుకున్నారు.
ఇక ఇప్పుడు మూడోసారి హను రాఘవ పూడికి( Hanu Raghavapudi ) మళ్లీ రిస్క్ చేసే అవకాశం ఇచ్చారు.
ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం మీడియం రేంజ్ హీరోలను మాత్రమే హను రాఘవపూడి డైరెక్ట్ చేశారు.పైగా ఇప్పుడు కొత్తగా యాక్షన్స్ సినిమా కథ రాసుకొని మరి ప్రభాస్ కి డైరెక్షన్ చేయబోతున్నాడు హను రాఘవపూడి.మరి చూడాలి ఏ మేరకు ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో.
ఇక రామ్ చరణ్( Ram Charan ) కూడా బుచ్చిబాబుకి( Buchibabu ) అవకాశం ఇయ్యడం చాలా పెద్ద రిస్క్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బుచ్చిబాబు కేవలం ఉపనసని మా మాత్రమే తీశాడు.సుకుమార్ శిష్యుడు కాబట్టి ఈ అవకాశం దొరకడం పెద్ద విషయం ఏమి కాదు కానీ బుచ్చిబాబు కి.ఈ సినిమా పరాజయం పాలైతే ఇక కెరియర్ లో కోలుకోవడం అసాధ్యం.అయినా కూడా రామ్ చరణ్ రిస్కు చేసి సెట్స్ మీదికి వెళ్తున్నారు.