తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకోవడమే కాకుండా తెలుగు సినిమా హిస్టరీలో చాలా సినిమాలు తీసి వాళ్ళకంటూ మంచి విజయాలను కూడా దక్కించుకోవాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి కోవ కి చెందిన డైరెక్టర్లలో ముప్పలనేని శివ( Muppalaneni Siva ) ఒకరు.
ఈయన అప్పట్లో వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు అనేది సంపాదించుకున్నారు.ఇక అందులో భాగంగానే ఆయన చేసిన సినిమాలు అన్ని కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా ఫ్యామిలీ సబ్జెక్ట్ కి సంబంధించిన సినిమాలు ఎక్కువగా చేస్తూ ప్రేక్షకుల్లో డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.ఆయన వెంకటేష్ తో చేసిన రాజా సినిమా( Raja Movie ) సెంటిమెంటల్ గా చాలా బాగా వర్క్ అవుట్ అయింది.అలాగే మరో సినిమా అయినా సంక్రాంతి సినిమా( Sankranti Movie ) కూడా ప్రతి ఫ్యామిలీ ప్రేక్షకుడికి దగ్గర అయింది.ఆ విషయానికి వస్తే సంక్రాంతి సినిమాని మొదటగా నాగార్జునతో( Nagarjuna ) చేద్దామని దర్శకుడు శివ అనుకున్నప్పటికీ ఆ స్టోరీ విన్న నాగార్జున
ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్టు నాకు పెద్దగా సెట్ అవ్వవు అని తప్పించుకున్నాడు.దాంతో వెంకటేష్ గారికి( Venkatesh ) ఈ కథ చెప్పి ముప్పలనేని శివ ఈ సినిమాని తిరకెక్కించడం జరిగింది.ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చి ఈ సినిమా ని చూడటానికి అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి.
సూపర్ డూపర్ హిట్ సినిమాను మిస్ అయినందుకు ఆ తర్వాత నాగార్జున చాలా బాధపడినట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ముప్పలనేని శివ డైరెక్షన్ ఏమి చేయకుండా ఖాళీ ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు…
.