Mahesh Babu: 17 ఏళ్లుగా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఆ దాహం తీరడం లేదు .. మోక్షం కలిగేనా ?

సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) హీరోగా ఎంట్రీ ఇచ్చి మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఎంతో మంది ప్రేక్షక దేవుళ్ళ అభిమానాన్ని సంపాదించుకొని వందల సినిమాల్లో హీరోగా నటించాడు.ఆయన వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బాయ్ మహేష్ బాబు( Mahesh Babu ) మాత్రం కృష్ణతో పోలిస్తే కొన్ని విషయాల్లో వెనుకంజలోనే ఉన్నారని ఒప్పుకోక తప్పదు.మహేష్ బాబు చిన్నతనం నుంచి సినిమాల్లో నటిస్తున్నారు.1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్న మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించినా కూడా ఒకే ఒక్క కోరిక మాత్రం ఆయన ఫ్యాన్స్ కి అలా తీరకుండా ఉండిపోయింది.

 Why Mahesh Babu Fans Are Diappointed-TeluguStop.com
Telugu Puri Jagannath, Guntur Karam, Mahesh Babu, Pokiri-Movie

మహేష్ బాబు పోకిరి సినిమా( Pokiri ) తర్వాత ఆ రేంజ్ లో మాస్ హీరోగా చూపించడం ఏ దర్శకుడికి కూడా సాధ్యం కావడం లేదు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి తర్వాత ఇప్పటి వరకు కూడా అతడి స్టామినా అంచనా వేయడంలో దర్శకులు పొరపాటు చేస్తున్నారా అంటే అందులో నిజం కూడా లేకపోలేదు.మహేష్ బాబుని మిల్కీ బాయ్ గానే ఇంకా ఊహించుకుంటున్నారు మన ఇండస్ట్రీ దర్శకులు.

వాస్తవానికి పూరీ( Puri Jagannath ) మాత్రం పోకిరి సినిమాతో 2006 లోనే అతని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేశాడు.ఈ చిత్రం విడుదలై దాదాపు 17 సంవత్సరాలు అవుతుంది.

ఇప్పటి వరకు మళ్ళీ ఆ స్థాయి మాస్ సినిమా( Mass Movie ) మహేష్ బాబుకు పడడం లేదని ఆయన అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.

Telugu Puri Jagannath, Guntur Karam, Mahesh Babu, Pokiri-Movie

మరి ఆ దాహం గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమాతో అయినా తీరుతుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.ఒక్కసారి మా మహేష్ బాబు ని చూసి చెప్పండి ఇంత మంచి కటౌట్ ఉన్న హీరోని మాస్ ప్రేక్షకులకు దూరం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.40 కోట్ల నుంచి 100 కోట్ల హీరోగా మహేష్ ఎదిగిన కూడా ఆ ఫీట్ అందుకోవడం లో మాత్రం విఫలం అవుతూ ఉన్నారు.అంతెందుకు పోకిరి లాంటి హిట్ ఇచ్చిన పూరి జగన్నాధ్ సైతం బిజినెస్ మ్యాన్ తో మరో అవకాశం దొరికిన ఆ రేంజ్ మాస్ హిట్ కొట్టలేకపోయాడు అంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube