బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు సీఎం కేసీఆర్ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు చురకలు అంటించారు.
న్యాయం కోరుతూ పార్లమెంట్ ఎదుట ఆరిజన్ డెయిరీ సీఈవో శేజల్ నిరసన చేస్తున్నారన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్షని ప్రశ్నించారు.అధికార పార్టీ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల గురించి బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పక్క రాష్ట్రంలో ఏదైనా జరిగితే వెంటనే స్పందించే స్మితా సబర్వాల్, మహిళా కమిషనర్ సునీతారెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఇకనైనా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.