దిల్ రాజు ఈ విషయంలో టాలీవుడ్ లో చాలామంది కన్నా గ్రేట్ తెలుసా ?

సినిమా అనేది ఇప్పుడున్న లెక్కల ప్రకారం పూర్తిగా కమర్షియల్ ఫార్ములా.ఒక సినిమా విజయాన్ని, పరాజయాన్ని కేవలం వచ్చే కలెక్షన్స్ తో మాత్రమే అంచనా వేసే రోజులు ఇవి.

 Why Dil Raju Offering To Flop Directors Details, Dil Raju, Producer Dil Raju, Fl-TeluguStop.com

మరి సినిమాకి డబ్బులు వస్తే తప్ప హిట్టు అని ఒప్పుకోలేము.అలాంటి హిట్ సినిమా తీస్తేనే ప్రొడ్యూసర్ బ్రతుకుతాడు.

కానీ సినిమా ఫెయిల్ అయితే దానికి పూర్తి బాధ్యత ప్రొడ్యూసర్ కాదు కేవలం అది డైరెక్టర్ పైనే ఉంటుంది.మరి ఫ్లాప్ సినిమాలు తీసే డైరెక్టర్ కి ఎవరు అవకాశాలు ఇస్తారు చెప్పండి.

కానీ దిల్ రాజు( Dil Raju ) ఈ విషయంలో చాలామంది ప్రొడ్యూసర్స్ కన్నా ఒక అడుగు ముందు గానే ఉంటారు.దిల్ రాజ్ కి సినిమా హిట్ అవడం లేదా ఫ్లాప్ అవడం పెద్ద విషయం కాదు.

కేవలం తన ఇచ్చిన మాట కోసం ఎన్నోసార్లు పరాజయాల్లో ఉన్న దర్శకులను ఎంకరేజ్ చేశారు.

Telugu Dil Raju, Parasuram, Venu Sri Ram, Flop Directors, Maharshi, Vakeel Saab-

గతంలో వంశీ పైడిపల్లికి( Vamshi Paidipally ) ఎంతో నమ్మి మున్నా సినిమా అవకాశం ఇస్తే అది ఫ్లాప్ అయింది అయితే వంశీ పై ఉన్న నమ్మకంతో మరో సినిమా అవకాశం ఇచ్చారు దాంతో బృందావనం( Brindavanam Movie ) లాంటి ఒక హిట్టు సినిమా వచ్చింది సినిమాకి తారకని ఒప్పించమని దిల్ రాజు వంశీ పైడిపల్లికి సినిమా సెట్ చేసి పెట్టారు ఆ తర్వాత ఊపిరి మహర్షి వంటి గొప్ప సినిమాలు తీశాడు వంశీ పైడిపల్లి ఇక ఇప్పటికీ వంశీ పైడిపల్లి తీసే ప్రతి సినిమాకు దిల్ రాజు ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు.

Telugu Dil Raju, Parasuram, Venu Sri Ram, Flop Directors, Maharshi, Vakeel Saab-

వేణు శ్రీరామ్( Venu Sriram ) సైతం దిల్ రాజు లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఇప్పటి వరకు.వేణు తీసిన అన్ని సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు.2011లో వేణు శ్రీరామ్ మొదటిగా ఓ మై ఫ్రెండ్ అనే సినిమా సిద్ధార్థ హీరోగా తీస్తే ఇది పరవాలేదు అనిపించింది.దీని తర్వాత దాదాపు ఆరేళ్ల సమయం తీసుకొని మళ్లీ దిల్ రాజు నిర్మాణం లోనే మిడిల్ క్లాస్ అబ్బాయి( Middle Class Abbayi ) అనే సినిమా తీశాడు.

దీంట్లో నాని హీరోగా నటించగా ఇది కూడా పరవాలేదు అనిపించింది.కానీ ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం అందించలేదు.అయినా కూడా వేణు శ్రీ రామ్ పై ఉన్న నమ్మకంతో దిల్ రాజు వకీల్ సాబ్( Vakeel Saab ) సినిమా కూడా అతని చేతిలోనే పెట్టాడు.ఇది కలెక్షన్స్ పరంగా పరవాలేదు అనిపించింది.

Telugu Dil Raju, Parasuram, Venu Sri Ram, Flop Directors, Maharshi, Vakeel Saab-

ఇప్పుడు దర్శకుడు పరుశురాంకి( Director Parasuram ) కూడా ఆ వరంలా దొరికాడు దిల్ రాజు.గీత గోవిందం విజయం తర్వాత సర్కార్ వారి పాట సినిమా తీశాడు పరశురాం.దాని తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ పూర్తి స్థాయిలో దిల్ రాజును కలెక్షన్స్ పరంగా ముంచేసింది.అయినప్పటికి కూడా మరో సినిమా అవకాశం ఇచ్చారట.దీన్ని బట్టి చూస్తే పరాజయం అనేది దిల్ రాజు కి లెక్క కాదు అని తెలుస్తుంది.ఒక్కసారి దిల్ రాజు నమ్మాడు అంటే ఖచ్చితంగా కలెక్షన్స్ కురిపించే సినిమాలు ఒకటి కాకపోతే మరోటి తీయించుకుంటాడని నమ్మకంతోనే ఇలా అవకాశాలు ఇస్తూ ఉంటాడని ఆయనను గమనించే వారు చెప్పే మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube