తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ‘స్టైలిష్ స్టార్’ గా తన స్టామినాను చూపించిన అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు.ఇక దాంతోపాటు ‘ఐకాన్ స్టార్’ గా కూడా తనను తాను రిప్రజెంట్ చేసుకున్నాడు.
ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇప్పుడు మంచి విజయాన్ని అందుకునే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాయి.ఇక పుష్ప సినిమా( Pushpa movie ) పాన్ ఇండియా లో 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టు పైకి ఎక్కించిందనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత తను ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే సస్పెన్స్ అయితే చాలా రోజుల నుంచి నడుస్తుంది.ఇక ఆయన కోసం ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్న త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడా? లేదంటే అట్లీ ( Atlee )కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు.కాబట్టి తనతో సినిమా చేస్తాడా అనే విషయాల మీద చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి.
ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కే ఓటు వేసే విధంగా కనిపిస్తున్నాడు.
ఇక ఇప్పటికే త్రివిక్రమ్( Trivikram ) చెప్పిన కథ తనకి నచ్చిందట.ఇక త్రివిక్రమ్ కూడా ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు.గత సినిమాల మాదిరిగా కాకుండా సీరియస్ గా ఈ సినిమాను నడిపించబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ తర్వాత సినిమా ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది… ఇక త్రివిక్రమ్ కూడా ఈ సినిమాలో తనను తాను ప్రూవ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఇండస్ట్రీలో తన కెరియర్ అనేది సాఫీగా సాగుతుంది.
లేకపోతే మాత్రం ఆయన కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.