వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. డిలీట్ అయిన మెసేజ్‌లు సేవ్ చేసుకోవచ్చిలా!

సోషల్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ రోజుకొక అప్డేట్ ఇస్తూ వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ ‘Kept’ మెసేజ్‌ల ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు వెల్లడించింది.

 Whatsapp Reportedly Working On Kept Messages Feature,kept Messages Feature,whats-TeluguStop.com

ఈ సరికొత్త ఫీచర్ వలన అదృశ్యమవుతున్న మెసేజ్ లను సేవ్ చేయడానికి యూజర్లను అనుమతి లభిస్తుంది.ఇంకా బీటా టెస్టర్‌లకు ఈ అప్డేట్ అందుబాటులోకి రాలేదు.

Kept మెసేజ్ ఫీచర్ వలన ఉపయోగం ఏమంటే అదృశ్యమవుతున్న మెసేజ్‌లను చాలా తేలికగా సేవ్ చేయవచ్చు.ఈ ఫీచర్ బీటా టెస్టర్‌ల కోసం రూపొందించారని వినికిడి.

మీకు తెలుసు.సాధారణంగా తాత్కాలికంగా సేవ్ చేసిన మరియు అదృశ్యమయ్యే మెసేజ్ చాట్ నుంచి ఆటోమాటిక్‌గా డిలీట్ చేయడం అనేది కుదరని పని.అయితే యూజర్లు తమ మెసేజ్‌లను సేవ్ చేయకూడదనుకుంటే వాటిని ‘Un-Keep’ చేసేయొచ్చు.Wabetainfo ఇచ్చిన సమాచారం ప్రకారం.చాట్‌లో ఉంచిన మెసేజ్ సూచించే బుక్‌మార్క్ ఐకాన్.కీప్ మెసేజ్ గుర్తించడానికి అదృశ్యమయ్యే మెసేజ్ బబుల్‌లో కనిపిస్తుంది.ఈ ఐకాన్ కనిపించిన తర్వాత, చాట్ విండో నుండి మెసేజ్ అదృశ్యం కాదు.

ఈ నేపథ్యంలో వాట్సాప్, ఫ్యూచర్ అప్‌డేట్ కోసం ప్రస్తుతం అదృశ్యమయ్యే మెసేజ్‌లను ఉంచే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోందని సదరు వెబ్‌సైట్ పేర్కొంది.ఇకపోతే ఈ ఫీచర్ ఎప్పుడు యూజర్లకు అందుబాటులోకి వస్తుందో అనే విషయం మాత్రం ఇంకా వెలువడాల్సి వుంది.ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల సందర్భాలలో మెసేజింగ్ యాప్‌ను యాక్సెస్ చేయడానికి WhatsApp అధికారికంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టుగా తెలుస్తోంది.

WhatsApp Proxy సర్వర్‌లను ఉపయోగించి WhatsApp యూజర్లు మెసేజ్ యాప్‌ను యాక్సెస్ చేయగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube