సాధారణంగా ఏ సినిమా అయినా సరే హిట్ కొట్టాలంటే హీరో తన హీరోయిజాన్ని సినిమాలో చూపించాల్సింది లేదంటే హీరోను చంపడం, హీరోయిన్ తో రొమాన్స్ చేయడం చివరికి అందరు కలిసిపోవడం శుభం కార్డు పడటం ఇలాంటివే రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం.కానీ హీరో చనిపోతే మాత్రం తన అభిమానులు తట్టుకోలేరు, హీరో ఉంటేనే సినిమా విజయవంతం అవుతుంది అని బలంగా ఇండస్ట్రీ సైతం నమ్ముతుంది.
కానీ హీరో చనిపోయిన కూడా సినిమాలు హిట్ కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు.ఆలా కొన్ని సినిమాలు మన తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నాయ్.
ఇలాంటి తరహా సినిమల్లో స్పెషలిస్ట్ గా చెప్పుకోవాల్సింది హీరో నాని గురించి.ఇలా హీరో నాని సినిమాలో నటిస్తూ తన చనిపోయిన సరే విజయం సాధించిన సినిమాలు ఏంటో చూద్దాం పదండి.
హీరో నాని తన కెరియర్ మొత్తం మీద ఐదు సినిమాలో తన పాత్ర చనిపోగా ఆ ఐదు సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని సంపాదించుకున్నాయి.దాంట్లో చెప్పుకోదగ్గ విషయం రాజమౌళి తీసిన ఈగ సినిమా ఈ సినిమాలో నాని పాత్ర సినిమా సగం వరకు ఉండి, ఆ తర్వాత చనిపోతుంది.
చనిపోయిన తర్వాత ఈగలాగా తన లవర్ ని ఎలా కాపాడుకుంటాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు,
ఇక ఈగ తర్వాత మరొక సినిమా జెర్సీ.
గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా సినిమా జెర్సీ ఈ సినిమాలో సైతం నాని పాత్ర అర్ధాంతరంగా కన్నుమూస్తుంది.జెర్సీ సినిమా సైతం మంచి విజయాన్ని నమోదు చేసుకొని నాని కెరియర్ ని ఒక మెట్టు ఎక్కించింది.
ఇక మూడవ సినిమా భీమిలి కబడ్డీ జట్టు.విలేజ్ లవ్ స్టోరీ గా ఈ సినిమ తెరకెక్కగా, ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో సైతం జెర్సీ సినిమాలో ఎలా అయితే క్రికెట్ ఆడుతూ నాని పాత్రా కన్నుమూస్తాడో ఈ చిత్రంలో కూడా అలాగే కబడ్డి ఆడుతూ నాని పాత్ర కన్ను మూస్తుంది.ఈ చిత్రం సైతం నాని కి మంచి పేరు ను తీసుకు రావడమే కాదు ఘనవిజయాన్ని సైతం సాధించింది.
ఇక మరొక చిత్రం జెంటిల్మెన్. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ లో కూడా నాని పాత్ర చివర్లో కన్ను మూస్తుంది.ఈ సినిమా సైతం మంచి పేరు తీసుకొచ్చింది ఇక చివరగా ఇటీవల వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా. ఈ చిత్రంలో నాని పాత్ర కన్ను మూస్తుంది ఈ చిత్రం సైతం ఘన విజయం సాధించింది.
ఇలా నాని తన కెరియర్ మొత్తంలో ఏకంగా ఐదు సినిమాల్లో తన పాత్ర చనిపోగా ఆ ఐదు చిత్రాలు కూడా ఘనవిజయాన్ని సాధించడం కోసం మెరుపు.