వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. డిలీట్ అయిన మెసేజ్‌లు సేవ్ చేసుకోవచ్చిలా!
TeluguStop.com
సోషల్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ రోజుకొక అప్డేట్ ఇస్తూ వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ ‘Kept’ మెసేజ్‌ల ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు వెల్లడించింది.
ఈ సరికొత్త ఫీచర్ వలన అదృశ్యమవుతున్న మెసేజ్ లను సేవ్ చేయడానికి యూజర్లను అనుమతి లభిస్తుంది.
ఇంకా బీటా టెస్టర్లకు ఈ అప్డేట్ అందుబాటులోకి రాలేదు.ఈ Kept మెసేజ్ ఫీచర్ వలన ఉపయోగం ఏమంటే అదృశ్యమవుతున్న మెసేజ్‌లను చాలా తేలికగా సేవ్ చేయవచ్చు.
ఈ ఫీచర్ బీటా టెస్టర్ల కోసం రూపొందించారని వినికిడి.మీకు తెలుసు.
సాధారణంగా తాత్కాలికంగా సేవ్ చేసిన మరియు అదృశ్యమయ్యే మెసేజ్ చాట్ నుంచి ఆటోమాటిక్‌గా డిలీట్ చేయడం అనేది కుదరని పని.
అయితే యూజర్లు తమ మెసేజ్‌లను సేవ్ చేయకూడదనుకుంటే వాటిని ‘Un-Keep’ చేసేయొచ్చు.Wabetainfo ఇచ్చిన సమాచారం ప్రకారం.
చాట్‌లో ఉంచిన మెసేజ్ సూచించే బుక్‌మార్క్ ఐకాన్.కీప్ మెసేజ్ గుర్తించడానికి అదృశ్యమయ్యే మెసేజ్ బబుల్‌లో కనిపిస్తుంది.
ఈ ఐకాన్ కనిపించిన తర్వాత, చాట్ విండో నుండి మెసేజ్ అదృశ్యం కాదు.
"""/"/
ఈ నేపథ్యంలో వాట్సాప్, ఫ్యూచర్ అప్డేట్ కోసం ప్రస్తుతం అదృశ్యమయ్యే మెసేజ్‌లను ఉంచే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోందని సదరు వెబ్సైట్ పేర్కొంది.
ఇకపోతే ఈ ఫీచర్ ఎప్పుడు యూజర్లకు అందుబాటులోకి వస్తుందో అనే విషయం మాత్రం ఇంకా వెలువడాల్సి వుంది.
ఇంటర్నెట్ షట్డౌన్ల సందర్భాలలో మెసేజింగ్ యాప్‌ను యాక్సెస్ చేయడానికి WhatsApp అధికారికంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టుగా తెలుస్తోంది.
WhatsApp Proxy సర్వర్లను ఉపయోగించి WhatsApp యూజర్లు మెసేజ్ యాప్‌ను యాక్సెస్ చేయగలరు.
దేవరతో జాన్వీ కపూర్ హిట్ అందుకుందా..? ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందా..?