తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డివంగా( Sandeep Reddy Vanga).ప్రస్తుతం చేస్తున్న వరుస సినిమాలు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేస్తున్నాయి.
ఇలాంటి క్రమంలోనే ఆయన గత సంవత్సరం రన్బీర్ కపూర్( Ranbir Kapoor ) తో చేసిన ‘అనిమల్ ‘సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.అయితే ఈ సినిమా మీద బాలీవుడ్ లో ఇప్పటికి కూడా నెగిటివ్ కామెంట్స్ చేసేవారు చాలా మంది ఉన్నారు.
అయితే ఇలా ఎందుకు వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు అనే దానిమీద ఎవరికి సమాధానమైతే దొరకడం లేదు.ఇక వాళ్ళు ప్రత్యేకంగా సందీప్ రెడ్డి వంగని టార్గెట్ చేసి మాత్రమే అలాంటి కామెంట్లు చేస్తున్నారు అని చెప్పేవారు కూడా ఉన్నారు.అయితే ఈ సినిమాని రన్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కించారు.ఆయన కూడా హిందీ హీరోనే కాబట్టి ఎందుకు ఇలాంటి వ్యతిరేకతను చూపిస్తున్నారు.అనే దానిమీద పలు రకాల వ్యక్తులు పలు రకాల కామెంట్లైతే చేస్తున్నారు.రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమా దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక రీసెంట్ గా మరి కొంతమంది కూడా సందీప్ అనిమల్ సినిమాని టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు కూడా మాట్లాడారు.దానికి మాత్రం సందీప్ ఏ రకంగానూ స్పందించడం లేదు.ఇంతకుముందు వరకు అగ్రేసీవ్ గా ఎదుర్కొన్న సందీప్ ఇప్పుడు ఎవడైనా పర్లేదు కామెంట్స్ చేసుకుంటే చేసుకోండి అందరికి సమాధానం చెప్పుకుంటూ కూర్చునే అంత సమయం నా దగ్గర లేదు అంటూ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం విశేషం…ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్( Prabhas ) తో స్పిరిట్ అనే చేస్తున్నాడు…తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది.ఇక ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది…
.