ఈరోజు ఐపిఎల్ లో భాగంగా ముంబై , బెంగళూరు ( Royal Challengers Bangalore , Mumbai Indians )జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఏ టీమ్ విజయం సాధిస్తుంది.అనే దాని పైన తీవ్రమైన చర్చలు అయితే జరుగుతున్నాయి.
నిజానికి ముంబై టీం వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించి తమ పరువును నిలబెట్టుకుంది.మరి ఆ విజయాల పరంపర ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ముందుకు సాగుతారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక దానికి తగ్గట్టుగానే బెంగళూరు టీం కూడా మొదట్లో బాగా ఆడినప్పటికి ఆ తర్వాత మాత్రం చాలా తడబడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక రాజస్థాన్ రాయల్స్ మీద భారీ పరుగులు చేసినప్పటికీ ఫలితం మాత్రం వీళ్లకు అనుకూలంగా రాకపోవడం ఒక వంతుకు వీళ్లకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక ఈరోజు ఈ రెండు టీం ల మధ్య టఫ్ ఫైట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ రెండు టీమ్ లను చూసుకుంటే రెండు టీం ల్లోని ప్లేయర్స్ కూడా చాలా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు.అయినప్పటికీ ఆయా టైం లో ఏ ప్లేయర్ టీం ని ఆదుకుంటాడు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారుతుంది.ఇక ముంబై ఇండియన్స్ టీమ్ ను కనుక చూసుకుంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా లాంటి చాలా మంది ప్లేయర్స్ ఫామ్ లో ఉన్నారు.
అలాగే బుమ్రా( Jasprit Bumrah ) కూడా తన స్పెల్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ను భయపెట్టే ప్రయత్నమైతే చేస్తాడు.

ఇక దానికి తగ్గట్టుగానే రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ టీమ్ లో కూడా బ్యాట్స్ మెన్స్ లకి కొదవలేదు. డూప్లిసిస్ l, కోహ్లీ, దినేష్ కార్తీక్ లతో ఈ టీం కూడా చాలా పటిష్టం గా ఉంది.అయినప్పటికీ ఈ టీమ్ లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటి అంటే బౌలింగ్ లో వీళ్ళు వాళ్ళ మార్క్ ను అయితే చూపించలేకపోతున్నారు.
దానివల్లే గత మ్యాచ్ లో రాజస్థాన్ మీద భారీ పరుగులు చేసి కూడా ఓడిపోవాల్సి వచ్చింది.ఇక ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం రెండు టీమ్ లకు కూడా 50-50 ఉండడం విశేషం…