ఐపీఎల్ 17వ సీజన్( IPL 17th season ) లో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో ప్రతి టీం కూడా తమ సత్తాను చాటుతూ ముందుకు కదులుతుంది.ఇక ఇలాంటి క్రమంలోనే మన ఇండియన్ ప్లేయర్లందరు కూడా తమ తమ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ టీం కి వరుస విజయాలను అందిస్తున్నారు.
ఇక ఈసారి కూడా మన ఇండియన్ ప్లేయర్లకే ఆరెంజ్ క్యాప్ అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది.ఇప్పటికే విరాట్ కోహ్లీ ( Virat Kohli )5 మ్యాచ్ ల్లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలను నమోదు చేసి 316 పరుగులు చేశాడు.
ఇక ఈయన తర్వాత రాజస్థాన్ టీమ్ ప్లేయర్ అయిన రియాన్ పరాగ్( Riyan Parag ) తనదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ రాజస్థాన్ టీమ్ విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు…ఇక రియాన్ పరాగ్ ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడితే అందులో 3 హాఫ్ సెంచరీలు చేసి 261 పరుగులు చేశాడు.ఇక మొత్తానికైతే ఈ సంవత్సరం రియాన్ పరాగ్ అద్భుతమైన ఫామ్ ను కనబరుస్తు ముందుకు సాగడం అనేది ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి.గత కొన్ని సిజన్ల నుంచి రియాన్ పరాగ్ సరిగ్గా ఆడకపోయిన రాజస్థాన్ టీమ్ ఆయన మీద నమ్మకంతో ఆయన్ని ఈ సీజన్లో కూడా కంటిన్యూ చేసింది.ఇక టీమ్ యాజమాన్యం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సీజన్ లో అదరగొడుతూ ముందుకు సాగుతున్నాడు.
ఇక నెక్స్ట్ జరగబోయే టి20 వరల్డ్ క( T20 World )ప్ లో తను ఇండియన్ టీం లో ప్లేస్ సంపాదించుకోవడం పక్క అంటూ చాలా మంది సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.విషయం ఏంటంటే ఐపిఎల్ తర్వాత అడబోయే టి 20 వరల్డ్ కప్ టీంలో ఎవరు ఉన్నా లేకపోయినా రియాన్ పరాగ్ మాత్రం పక్కా ఉండబోతున్నాడు అని బిసిసిఐ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది.చూడాలి మరి టి20 వరల్డ్ కప్ కోసం ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది…
.