ఇప్పటికీ జనసేన పరిస్థితి ఇంతేనా ..?

ఒకవైపు ఎన్నికల సమయం చూస్తే.తరుముకొచ్చేస్తోంది.

 What Is The Pawan Kalyan Janasena Position In Ap-TeluguStop.com

మరో వైపు చూస్తే… అధికారం మాదే అంటూ… ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా… కొత్తగా పుట్టుకొచ్చిన జనసేన పార్టీ.

పరిస్థితి పై ఇప్పుడు అందరి ద్రుష్టి పడింది.అసలు పవన్ రాజకీయ అడుగులు ఎటువైపు పడుతున్నాయి తెలియక అంతా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

జనసేన ఏపీలో అధికారాన్ని కూడా చేపడుతుంది పవన్ కూడా అదే మాట చెబుతున్నాడు.అంతే కాదు .తాను ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిని అని పవన్ చెప్పుకుంటున్నాడు.

వేరే ఎవరైనా సీఎం సీటును ఆశించడం తప్పు.తను మాత్రం సీఎం అయిపోతానని ప్రకటించుకోవచ్చు.ఇదీ పవన్ కల్యాణ్ తీరు.

వేరే వాళ్లకు నీతులు చెప్పే పవన్ కల్యాణ్ తను మాత్రం వాటిని ఆచరించాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు.
మరో నాలుగైదు నెలల్లో… ఏపీలో కూడా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది.

అటు లోక్ సభ ఎన్నికలకు, ఇటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ఒకేసారి వస్తుంది.ఇటువంటి కీలక సమయంలో … ఇంకా పార్టీని సరైన విధంగా పట్టాలెక్కించలేదు పవన్.

అప్పుడప్పుడూ… సభలు, సమావేశాలు పెట్టుకొంటూ పోతున్నాడు.వాటిల్లో ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటాడు.

అయితే జనసేనలో ఇప్పటి వరకూ నేతల హడావుడి ఎక్కడా కనిపించడం లేదు.ఏది మాట్లాడినా ఆయనొక్కడే మాట్లాడుతున్నాడు.

ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో … జననసేన పోటీచేస్తుందని పవన్ ప్రకటించేశాడు.అయితే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేంత మంది అభ్యర్థులు జనసేనలో ఉన్నారా? అనేదానికి ఆన్సర్ కనిపించడంలేదు.పార్టీలో తోట చంద్రశేఖర్ వంటి మాస్ లో గుర్తింపు కూడా లేని వాళ్లు ఇద్దరుముగ్గురు కనిపిస్తున్నారు.ఆపై నాదెండ్ల మనోహర్.అంతటా అతడే కనిపిస్తూ ఉన్నాడు.ఒక రాజకీయ పార్టీ అంటే ఇంతేనా? నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఒక పార్టీ ఉండాల్సింది ఇలాగేనా? క్షేత్ర స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేస్తారు .? ఇలాంటివి అన్నీ క్కులేషన్ మార్క్ గానే కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube