ఆ పార్టీ అంటే అంత భయం ఏంటి బాస్ ..?

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద చిక్కొచ్చిపడింది.అది అలాంటి ఇలాంటి చిక్కుకాదు .

 Is Kcr Fears With Tdp In Mahakutami-TeluguStop.com

అందరికి అది చిన్నగానే కనిపించినా కేసీఆర్ కి మాత్రం చాలా పెద్దగా కనిపిస్తోంది.అందుకే ఆయన అంతగా కలవరపడుతున్నాడు.

తెలంగాణాలో మహాకూటమి తరపున ఆ బరిలో ఉన్న అన్ని పార్టీలను పక్కనపెట్టి టీడీపీ పైనే ప్రధానంగా ఫోకస్ చేసాడు కేసీఆర్.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో పోటీ చేస్తుండగా… టీడీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే పోటీలో ఉంది.

అయితే టీడీపీ తక్కువ సాహనాల్లో పోటీ చేసినా… బాబు వ్యూహాలు ఎలా ఉంటాయో , ఆయన సత్తా ఏంటో కేసీఆర్ కి బాగా తెలుసు అందుకే ఇంతగా…కేసీఆర్ భయపడుతున్నాడు.

ఛాన్స్ దొరికితే చాలు టీడీపీనే టార్గెట్ చేస్తోంది.మహాకూటమిలో భాగంగా 119 స్థానాలకు గాను అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం కంటే కూడా కేవలం 14 స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీని గులాబీ బాస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకుల్లో బయలుదేరింది.వాస్తవానికి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణాని అభివృద్ధి చేసుకోడం కంటే టీడీపీని బలహీన పరచడానికే కేసీఆర్ సర్కార్ పాటు పడిందనే చెప్పొచ్చు.

టీడీపీ క్యాడర్ చాలావరకు టీడీపీలో చేరిపోయారు.అయితే అంతో ఇంతో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మాత్రం టీఆర్ఎస్ లెక్కల్లోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు.

అసలు తమకు కాంగ్రెస్ పార్టీ పోటీనే కాదు అన్నట్టుగా.టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోంది.రాష్ట్రంలో ఎన్నో పార్టీలున్నా కూడా టీఆర్ఎస్ మాత్రం తన ప్రధాన ప్రత్యర్థిగా టీడీపీని చూడటం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్.తాజాగా టీడీపీపై గులాబీ బాస్ కేసీఆర్ చేసిన కామెంట్లు చర్చానీయాంశంగా మారాయి.14 స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీకి కాంగ్రెస్ శ్రేణులు సహకరించవని కుండబద్దలు కొట్టారు కేసీఆర్.అంతేకాదు టీడీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కూడా టీడీపీ టార్గెట్ గానే మాటల తూటాలు పేలుతున్నాయి.టీఆర్ఎస్ ను ఓడించడం ఎవరితరం కాదని బలం లేకనే టీడీపీ పొత్తులబాట పట్టిందని విమర్శిస్తున్నారు.

అంతే కాదు టీడీపీ సిద్ధాంతాలను సైతం పక్కనపెట్టి కాంగ్రెస్ తో జత కలిసింది అంటూ… విమర్శలు గుప్పించడం చూస్తుంటే టీఆర్ఎస్ కి టీడీపీ అంటే ఎంత కంగారో అర్ధం అవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube