ఇటీవల సోషల్ మీడియాలో విచిత్ర వంటకాలు వైరల్ అవుతున్నాయి.కొంతమంది విచిత్ర రెసిపీలు( Strange Recipies ) తయారుచేస్తున్నారు.
ఇటీవల ఆయిల్ కు బదులు బీర్‌తో ఆమ్లెట్ వేసిన వీడియో వైరల్ అవ్వగా.అలాగే వివిధ వెరైటీల పదార్ధాలతో దోసెలు తయారుచేస్తున్నారు.
ఇటీవల ఆయిల్‌కు బదులు బీర్ పోసి దోస తయారుచేసిన ఒక వీడియో వైరల్ అయింది.అలాగే చాక్లెట్ తో దోశ వేయడం లాంటి ఎన్నో వెరైటీలు కొత్తగా ట్రై చేస్తున్నారు.
వీటిని తినేందుకు కూడా కస్టమర్లు క్యూ కడుతున్నారు.తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ఒక వెరైటీ ఫుడ్‌కు సంబంధించి వీడియో చక్కర్లు కొడుతుంది.
ఈ వీడియోలో వెరైటీ పదార్ధాలతో సమోసా( Samosa ) తయారుచేస్తున్నాడు ఒక వ్యక్తి.సమోసాను తినేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.సాయంత్రం స్నాక్స్ గా వీటిని తింటూ ఉంటారు.అలాగే టీ బంకుల్లో ఈ స్నాక్స్ ఎక్కువగా లభిస్తాయి.
కొంతమంది వీటిని తిన్న తర్వాత ఛాయ్ తాగుతారు.ఇక ట్రైన్లల్లో అయితే సమోసాలను ఎక్కువగా విక్రయిస్తూ ఉంటారు.
చాలామంది ప్రయాణికులు వీటిని కొనుగోలు చేసి తింటూ ఉంటారు.
ఇక సమోసాల్లో ఉల్లిపాయ సమోస, మొక్కజొన్న సమోసా, బంగాళదుంప సమోసా లాంటివి చాలా ఉంటాయి.కానీ ఈ వీడియోలో మాత్రం ఒక వ్యక్తి మ్యాగీ కాంబినేషన్‌లో సమోసా తయారుచేశాడు.దీనికి స్పైసీ మ్యాగీ సమోసా( Spicy Maggie Samosa ) అని పేరు పెట్టాడు.
ఉల్లిపాయలు, మిరపకాయలతో పాటు రకరకాల మసాలా దినుసులు, సమోసాలను మిక్సీలో వేశాడు.ఆ తర్వాత మ్యాగీలా దీనిని తయారుచేశాడు.
వీటిని చట్నీలో కలిపి కస్టమర్లను సదరు వ్యక్తి విక్రయిస్తున్నాడు.దీనికి సంబంధించిన వీడియోను ది గ్రేట్ ఇండియన్ ఫుడీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.దీంతో ఈ వెరైటీ వంటకం తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోకు ఇప్పటికే లక్షా 65 వేల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.