నటి సాయి పల్లవి ( Sai Pallavi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రేమమ్ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అనంతరం ఈమె తెలుగులో ఫిదా సినిమా ( Fidaa )ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక సాయి పల్లవి కెరియర్ పరంగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఏడాది కాలం నుంచి సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉండటంతో ఈమె గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సాయి పల్లకి పెళ్లి చేసుకుంటుందని అందుకే సినిమాలకు దూరంగా ఉంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.అయితే తాజాగా సాయి పల్లవి మరొక డైరెక్టర్ తో కలిసి మెడలో దండలు వేసుకొని ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సాయి పల్లవి డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో మరొక వార్త సంచలనంగా మారింది.అయితే సాయి పల్లవి గురించి ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల( Venu udugula ) ఈ ఫోటోపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవి సదురు డైరెక్టర్ గురించి వైరల్ అవుతున్న పూర్తి ఫోటోని షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది.సాయి పల్లవి ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ ( Shiva Karthikeyan ) సరసన ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా పూజ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఇలా మెడలో దండలు వేసుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఇలా డైరెక్టర్ వేణు ఈ ఫోటోని షేర్ చేయడంతో సాయి పల్లవి పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా ఫేక్ అంటూ అందరికీ క్లారిటీ వచ్చేసింది.
ఇక ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య ( Nagachaitanya ) నటిస్తున్నటువంటి సినిమాలో కూడా నటించబోతున్నారు అన్న విషయం మనకు తెలిసిందే.