వేసవికాలంలో మన శరీరంతో పాటు కళ్ళను కూడా కాపాడుకోవలసిన బాధ్యత చాలా ఉంది.వేసవిలో అధిక ఉష్ణోగ్రతకు కళ్ళు ఒత్తిడి,ఎరుపెక్కడం, వాపులకు గురి కావటం జరుగుతూ ఉంటుంది.
అలాగే కంటి కింద నల్లటి వలయాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.వేసవిలో కంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాలి.
వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.ఎండలోకి వెళ్లి వచ్చాక ముఖాన్ని,కళ్ళను చల్లని నీటితో శుభ్రంగా కడగాలి.
ఆ తర్వాత కంటిపై చల్లని నీటిలో ముంచిన కాటన్ ప్యాడ్స్‌ను పది నిముషాలు పెట్టుకుంటే రక్తనాళాలు రిలాక్స్ అయ్యి ఒత్తిడి తగ్గుతుంది.తద్వారా కళ్ళు ఫ్రెష్ గా ఉంటాయి.
అలోవెరా జ్యుస్ ను ఐస్ ట్రై లలో పోసి అలోవెరా క్యూబ్స్ గా తయారుచేయాలి.ఆ క్యూబ్స్ ని తీసుకోని కంటిపై పది నిముషాలు మసాజ్ చేస్తే కంటి మీద ఒత్తిడి తగ్గిపోయి కళ్ళు తాజాగా ఉంటాయి.
వేసవికాలంలో కంటి సమస్యలకు కీరదోస చాలా బాగా పనిచేస్తుంది.కంటిపై కిర దోస ముక్కలను పెట్టుకొని పది నిముషాలు అల ఉంటే కంటి సమస్యలు తగ్గుతాయి.బంగాళాదుంప ముక్కలను కంటిపై పెట్టుకోవటం వలన కంటి మీద ఒత్తిడి మరియు నల్లటి వలయాలు తొలగిపోతాయి.రోజ్ వాటార్‌లో కాటన్ బాల్స్‌ను ముంచి కంటిపై పెట్టుకొని పది నిమిషాల తర్వాత కళ్ళను శుభ్రం చేసుకుంటే కళ్ళ మీద ఒత్తిడి తొలగిపోయి రిలాక్స్ అవుతాయి.