ఏపీలో రాజకీయాలు మారాలంటే ఇప్పడున్న జోరు సరిపోవట్లేదు.ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాలు, అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పుతో విపక్ష పార్టీల్లో విశ్వాసం అమాంతం పెరిగింది.
మరోవైపు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుతోపాటు జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాల ఇష్యూతో విపక్ష రథానికి రాజకీయ ఇంధనంగా మారాయి.అయినా వారికి పట్టుదొరకడం లేదు.
దీంతో వారు జగన్‌వైపు చూస్తున్నారని సమాచారం.దీనికి కారణాలు లేకపోలేదు.
ఏపీ రాజకీయాలు మార్చేసే సామర్ధ్యం జగన్‌కు ఉందని టాక్.అయితే జగన్ రాజకీయ గేర్ మారిస్తే వైసీసీ కే అనుకూలం కదా.
మరి విపోఆలకు లాభమేంటనే ప్రశ్న తలెత్తక మానదు.
ఇక ఏపీలో వైసీపీ మూడేండ్ల పాలన ముగుస్తోంది.
మంత్రి వర్గర విస్తరణకు పూనుకున్నారు.ఇలాంటి సమయంలో ఆ నిర్ణయం తీసుకుంటే కొంతమందిని మార్చి ఊరుకోవచ్చు.
దీంతో అసంతృప్తి లేకుండా చూసుకోవచ్చు.కానీ, జగన్ 90శాతం పైగా మంత్రులను మార్చబోతున్నారు.
ఇది సాహసంతో కూడుకున్న పనే అని చెప్పొచ్చు.మాజీలుగా మారే వారు ఆగ్రహావేశాలతో ఉంటారు.
ఇక మంత్రి పదవి ఆశలు పెట్టుకున్న ఆశావహులకు చాన్స్ రాకుంటే ఫైర్ అయ్యే పరిస్థితి ఉంటుంది.మొత్తంగా జగన్‌తోపాఉ కొలువుదీరే 24మంది మంత్రులు తప్ప తక్కిన వారు అంతా ఏదో కారణంగా అసమ్మతి సెగ రగిలించే వీలుంటుంది.
ఇందులో సన్నిహితులను, జూనియర్లను బుజ్జగించొచ్చు.కానీ, సీనియర్లను దారికి తేవడం కత్తిమీద సాములాంటిదే.
ఇదే జరిగితే వైసీపీకి కొత్త చిక్కులు వచ్చిపడతాయి.

మంత్రి వర్గ విస్తరణ పర్వం ముగిస్తే ఇక పదవుల పందేరానికి వీలుండదు.ఎన్నకలకు వెళ్లిపోవడమే.ఇప్పటి వరకు ఎతం అసహనం ఉన్నా అణచిపెట్టుకుని అధికార పార్టీ జనాలు చాలామంది వేచి ఉన్నారు.
ఇక మంత్రి వర్గంలో బెర్త్ దొరక్కపోతే అసమ్మతి సెగ తగిలే వీలుంటుందని సమాచారం.ఇదే జరిగితే ఏపీలో రాజకీయం గేర్ మారినట్టే అవుతుంది.దీంతో విపక్ష రాజకీయం జోరందుకుంటుఒందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఇదంతా జగన్‌కు తెలియకుండా ఉండదు.
సో ఎలాంటి అసంతృప్తి లేకుండానే మంత్రి వర్గ విస్తరణ పూర్తి చేయాలనుకుంటున్నారు.మొత్తంగా విపక్షాలు ఎదురుచూస్తున్న ఆ ఛాన్స్ ఇస్తాడా ? లేదా ? అనేది వేచి చూడాలి.







