Vyjayanthimala : 90 సంవత్సరాల వయస్సులో భరతనాట్యం చేస్తున్న నటి.. ఈమె టాలెంట్ కు వావ్ అనాల్సిందే!

సాధారణంగా 90 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలలో ఎక్కువమంది ఇంటికే పరిమితం అవుతుంటారు.అయితే ఒకప్పుడు స్టార్ స్టేటస్ ను అందుకున్న వైజయంతిమాల మాత్రం 90 సంవత్సరాల వయస్సులో భరతనాట్యం( Bharatanatyam ) చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

 Vyjayanthi Mala Inspirational Story Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఐదు సంవత్సరాల వయస్సులోనే క్లాసికల్ డ్యాన్స్ ను మొదలుపెట్టిన వైజయంతీమాల 16 సంవత్సరాల వయస్సులోనే నటిగా మారారు. వాస్ కాయ్ సినిమా(Vaazkhai )తో సినిమాల్లో కెరీర్ ను మొదలుపెట్టిన వైజయంతీ మాల తర్వాత రోజుల్లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసిన వైజయంతిమాల ఇటీవల అయోధ్యలో భరత నాట్య ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.90 సంవత్సరాల వయస్సులో ఆమె ఎనర్జీ లెవెల్స్ ను చూసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.

Telugu Ayodhya, Ramlalla, Vyjayanthimala-Movie

భరతనాట్యంతో అందరినీ అబ్బురపరిచిన వైజయంతీమాల( Vyjayanthimala ) టాలెంట్ ను ఎంత పొగొడినా తక్కువేనని నెటిజన్లు చెబుతున్నారు.జనవరి 27వ తేదీ నుంచి అయోధ్యలో రామ్ లల్లా రాగసేవ( Ram Lalla Raag Seva ) అనే కార్యక్రమం 45 రోజుల పాటు జరుగుతుండగా ఈ కార్యక్రమంలో డ్యాన్స్ చేసి ప్రతిభకు వయస్సుతో పని లేదని ఆమె ప్రూవ్ చేశారు.1933 సంవత్సరంలో ఆమె జన్మించగా ఈ సినిమా తెలుగులో జీవితం పేరుతో రీమేక్ అయింది.

Telugu Ayodhya, Ramlalla, Vyjayanthimala-Movie

విచిత్రం ఏంటంటే జీవితం సినిమాలో కూడా వైజయంతీ మాల హీరోయిన్ గా నటించారు.1968 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.ఈ ఏడాది ఆమెను పద్మ విభూషణ్ వరించింది.

వైజయంతీమాల డ్యాన్స్( Vyjayanthimala Dance ) కు సంబంధించిన వీడియోకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.వైజయంతీ మాల టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని మరి కొందరు చెబుతుండటం గమనార్హం.

అయోధ్యలో జరుగుతున్న రామ్ లల్లా రాగసేవ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ సైతం ఆటపాటలతో అలరించనున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube