భారత ఆటగాళ్లకు యో-యో టెస్ట్..అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ..!

ఆసియా కప్ 2023( Asia Cup 2023 ) టోర్నీలో పాల్గొనే భారత జట్టు ఆటగాళ్లకు ఆగస్టు 24 నుంచి ఆగస్టు 29 వరకు బెంగుళూరులోని ఆలూర్ క్రికెట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ క్యాంప్ జరుగుతోంది.ఈ క్యాంప్ లో మొదటిరోజు భారత జట్టుకు ఎంపికైన 17 మంది సభ్యుల ఫిట్నెస్ పరీక్ష జరిగింది.

 Virat Kohli Passes Yo-yo Test Before Asia Cup 2023 Details, Virat Kohli , Virat-TeluguStop.com

ఇందులో లోకేష్ రాహుల్( Lokesh Rahul ) మినహా అందరూ పాల్గొన్నారు.జట్టులోని ఆటగాళ్లందరూ యో-యో టెస్టులో( Yo-Yo Test ) ఉత్తీర్ణత సాధించారు.17.2 పాయింట్లతో విరాట్ కోహ్లీ( Virat Kohli ) అగ్రస్థానంలో నిలిచాడు.బీసీసీఐ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించాలంటే ఆటగాడు తప్పనిసరిగా 16.5 పాయింట్లు సాధించాలి.

Telugu Asia Cup, Bangalore, Bcci, Hardik Pandya, Kl Rahul, Rohit Sharma, Sanju S

ఈ టెస్టులో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ,( Rohit Sharma ) వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) ఉత్తీర్ణులయ్యారు.త్వరలోనే నివేదికను బీసీసీఐకి పంపిస్తామని పీటీఐకి ఇచ్చిన ఒక ప్రకటనలో ఒక మూలం తెలిపింది.ఆగస్టు 25న జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, సంజూ శాంసన్, తిలక్ వర్మ ఈ ప్రాక్టీస్ క్యాంపులో చేరనున్నారు.ఈ ప్రాక్టీస్ క్యాంపులో మొదటి రోజు ఆటగాళ్లందరికీ ఫిట్నెస్ పరీక్ష జరిగింది.

రెండవ రోజు ఔట్ డోర్ ప్రాక్టీస్ జరుగనుంది.ఈ ప్రాక్టీస్ లో వివిధ రకాల పరిస్థితులకు అనుగుణంగా బ్యాట్స్ మెన్ ప్రాక్టీస్ చేయనున్నారు.

Telugu Asia Cup, Bangalore, Bcci, Hardik Pandya, Kl Rahul, Rohit Sharma, Sanju S

ఈ ప్రాక్టీస్ క్యాంపులో కేఎల్ రాహుల్ ను ( KL Rahul ) చేర్చుకోలేదు.ఆసియా కప్ ఆడే జట్టులో కేఎల్ రాహుల్ కు చోటు దక్కిన, ఇంకా ఇతను పూర్తి ఫిట్ గా లేడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశారు.ఫిట్నెస్ పరంగా చూస్తే కేఎల్ రాహుల్ ఆసియా కప్ లో ప్రారంభ మ్యాచులకు దూరంగా ఉండే అవకాశం ఉంది.రాహుల్ ఫిట్నెస్ ను దృష్టిలో ఉంచుకొని సంజూ శాంసన్ ను బ్యాకప్ ప్లేయర్ గా ఎంపిక చేశారు.

కేఎల్ రాహుల్ ఈ ప్రాక్టీస్ క్యాంపులో భాగమే కానీ యో-యో టెస్ట్ కు మాత్రం తీసుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube